Site icon Prime9

Allari Naresh: కమెడియన్లంటే ఇండస్ట్రీలో చాలా చిన్నచూపు.. చాలా బాధగా ఉందంటూ.. అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు

Allari Naresh

Allari Naresh

Allari Naresh: అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. నాంది దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా మే 5న థియేటర్స్ లో సందడి చేయనుంది. కాగా ఇందులో అల్లరి నరేష్ ఇంతకు ముందు చేసిన రోల్స్ కు పూర్తి భిన్నంగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. కాగా నాంది డైరెక్టర్ తో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ కాంబోపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని టాలీవుడ్ భావిస్తోంది.

కామెడీనే చాలా కష్టం(Allari Naresh)

ప్రస్తుతం ఉగ్రం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో సినీ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ కామెడీ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ అన్నిటికంటే కామెడీనే చాలా కష్టం. కామెడీ చేసే వాళ్ళు ఏ పాత్ర అయినా అద్భుతంగా చేయగలరని అల్లరి నరేష్ తెలిపారు. ఇటీవల రంగమార్తాండలో బ్రహ్మానందం, విడుదలలో సూరి వారివారి పాత్రలతో ప్రేక్షకులను ఎంతగా నవ్వించగలరో అంతకన్నా ఎక్కువగా ఏడిపించి మెప్పించారంటూ చెప్పుకొచ్చారు. నన్ను డైరెక్టర్ క్రిష్ నమ్మారు కాబట్టే గమ్యం సినిమా వచ్చిందని.. సముద్రఖని శంభో శివ శంభో మూవీ ఇచ్చారని ఇప్పుడు డైరెక్టర్ విజయ్ నాంది, ఉగ్రం సినిమాలు తీశారని ఆయన వివరించారు. మహర్షి సినిమా తర్వాత నేను ఇలాంటి పాత్రలు చేయగలనని అందరూ నమ్ముతున్నారని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.

కితకితలు, బెండు అప్పారావు, సుడిగాడు లాంటి సూపర్ హిట్ సినిమాలు చూసినప్పుడు నరేష్ సినిమా బాగుందని చాలా మంది చెప్పారు కానీ ఎవ్వరూ నా యాక్టింగ్ గురించి మాట్లాడలేదు.. కానీ గమ్యం, శంభో శివ శంభో, నాంది సినిమాలు చూశాక సినిమా కంటే కూడా నరేష్ బాగా యాక్ట్ చేశారు అంటున్నారని ఆయన తెలిపారు. కామెడీ చేసేవాళ్ళంటే ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంచెం చిన్న చూపు ఉందని అల్లరి నరేష్ అన్నారు. దానితో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

Exit mobile version