Site icon Prime9

Choreographer Rakesh Master Death : కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

tollywood Choreographer Rakesh Master Death news

tollywood Choreographer Rakesh Master Death news

Choreographer Rakesh Master Death : టాలీవుడ్ లో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విజయనగరంలో ఒక ఈవెంట్ నుంచి తిరిగి వచ్చాక రాకేష్ మాస్టర్ కు సన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దానివలన రక్త విరోచనాలు కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ వార్తతో ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన రాకేశ్ మాస్టర్ దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. ఇక గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఇంటర్వ్యూ ల ద్వారా యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు అనుకోని రీతిలో ఆయన మృతి చెందడం అందరికీ షాక్ కలిగించింది.

Exit mobile version