Site icon Prime9

Dimple Hayathi: హీరోయిన్‌ వాట్సప్‌ హ్యాక్‌ – జాగ్రత్తగా ఉండండని హెచ్చరించిన డింపుల్‌

Dimple Hayathi Whatsapp Hacked: ఈ మధ్య సైబర్‌ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల సోషల్‌ మీడియాలో అకౌంట్స్‌ని హ్యాక్ చేస్తూ వారి పేరుతో మోసాలను పాల్పడుతున్నారు. తరచూ సినీ సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా మరో నటిని టార్గెట్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు. నటి డింపుల్‌ హయాతికి ఇలాంటి అనుభవం ఎదురైంది.

అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ కాకుండ వాట్సప్‌ హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన వాట్సప్‌ హ్యాక్‌ అయినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్‌ చేసింది. తన వాట్సప్‌ ఎలాంటి మెసేజ్‌ వచ్చిన అవైయిడ్‌ చేయాలని , ఎవరూ స్పందించవద్దని పేర్కొంది. “గాయ్స్‌ నా వాట్సప్‌ హ్యాక్‌ అయ్యింది. మీకు ఏమైన అనసరమైన టెక్ట్స్‌ మెసేజ్‌ వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరూ వాటికి స్పందించకండి. ప్రస్తుతం రికవరి ప్రాసెస్‌ అవుతుంది” అని ఆమె పేర్కొంది.

కాగా డింపుల్‌ హయాతి గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. 2019లో వరుణ్‌ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్‌ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి ఆకట్టుకుంది. జర్ర జర్ర అంటూ సాగే ఈ పాటకు కాలు కదిపింది. హైదరాబాద్‌కు చెందిన డింపుల్‌ 2017లో గల్ఫ్‌ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్‌ మూవీలోని ఐటెం సాంగ్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత సామాన్యుడు, ఖిలాడి, రామబాణం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే హిందీలో ఆత్రంగి రే సినిమా చేసింది. తమిళంలోనూ డింపుల్ పలు సినిమాల్లో నటించింది.

Exit mobile version