Prime9

Thug Life Ban: కమల్‌ థగ్‌ లైఫ్‌ బ్యాన్‌ – కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court Send Notice to Karnataka Government Over Thug Life Ban: విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించి లేటెస్ట్‌ మూవీ ‘థగ్‌ లైఫ్‌’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి మూడు రోజులు కోలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపింది. కానీ, సెకండ్‌ వీక్‌లో ఆ జోరు చూపించడం లేదు. మూడో రోజు తర్వాత వసూళ్ల గ్రాఫ్‌ బాగా పడిపోయింది. ఇక తెలుగులో అయితే ఈ సినిమా గురించి పెద్దగా టాక్‌ వినిపించడం లేదు.

 

దీంతో థగ్‌ లైఫ్‌ ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. అయితే కలెక్షన్స్‌ తగ్గడానికి ఈ సినిమా కర్ణాటకలో బ్యాన్‌ చేయడం కూడా ఒక కారణమంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. కన్నడ భాషపై కమల్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సినిమాను అక్కడ బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహరంలో సుప్రీం కోర్టు, కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కర్ణాటకలో థగ్‌ లైఫ్‌ సినిమాని నిషేధించడంపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని ఆయన అన్నారు.

 

దీనిపై కన్నడీగులు, కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు భగ్గమన్నాయి. కమల్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, కర్ణాటక ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సైతం కమల్‌ సారీ చెప్పాలని డిమాండ్‌ చేసింది. మే 30లోగా క్షమాపణలు చెప్పకుండ థగ్‌ లైఫ్‌ బ్యాన్‌ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక కోర్టులో పిటిషన్‌ వేసింది. కేఎఫ్‌సీసీ పిటిషన్‌ను సవాలు చేస్తూ థగ్‌ లైఫ్‌ నిర్మాత కమల్‌ సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టు సైతం కమల్‌నే తప్పుబట్టింది. భాషపై కామెంట్స్‌ చేయాల్సిన అవసరం ఏముందని, క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా అని పేర్కొంది.

 

అయితే ఈ విషయంలో కమల్‌ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరించారు. తాను ఆ వ్యాఖ్యలు ప్రేమతో చేశానని, మనమంత ఒక్కటే అని చెప్పేందుకు తాను ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. అయినప్పటికీ కమల్‌ క్షమాపణలు చెప్పాల్సిందే కేఎఫ్‌సీసీ డిమాండ్‌ చేసింది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. దీంతో సెన్సార్‌ పూర్తయిన సినిమాను అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై థగ్‌ లైఫ్‌ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 17కి వాయిదా వేసింది.

Exit mobile version
Skip to toolbar