Site icon Prime9

Game Changer: శంకర్ భారీ స్కెచ్.. ఆ దేశంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్లాన్..!

Game Changer

Game Changer

Ram Charan Game Changer Pre Release Event: రంగస్థలం,ఆర్ఆర్ఆర్ మూవీల్లో రామ్ చరణ్ నట విశ్వరూపంతో గ్లోబల్ లెవెల్ కు చేరుకున్నారు చెర్రీ. దీంతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ దక్కింది. ప్రజెంట్ ఈ గ్లోబల్ స్టార్, గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ది సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్‌ను హిస్టరీ క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా ? అసలింతకీ గేమ్ ఛేంజర్ మూవీపై మేకర్స్ వేస్తున్న స్కెచ్చులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరుకుంది. ది ఫెమస్ డైరెక్టర్ శంకర్ క‌ల‌యిక‌తో ప్రజెంట్ గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. సోలోగా చరణ్ మూవీ వచ్చి దాదాపు 5 ఇయర్స్ దాటడంతో చెర్రీ ఫ్యాన్స్ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ భారీ రిలీజ్‌కు సిద్దమవుతోంది. రిలీజ్‌కు కేవ‌లం మ‌రో 2 నెలలు మాత్ర‌మే టైం ఉండడంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు మేకర్స్.

మొత్తానికి గేమ్ ఛేంజర్ మూవీ ప్ర‌చారంలో స్పీడ్ పెంచింది చిత్ర‌బృందం. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన 2 సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి మూడు సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎడిటింగ్ పూర్తి అయిన వెంటనే మూడో సాంగ్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడం ద్వారా మరింతగా పబ్లిసిటీ చేసే భావనలో మేకర్స్ ఉన్నారట. గేమ్‌ ఛేంజర్ మూవీకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

రీసెంట్‌గా సినిమా నుంచి వచ్చిన రా మచ్చా మచ్చా ,గతంలో రిలీజైన జరగండి సాంగ్స్‌కు పూర్తి విభిన్నంగా మెలోడీ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈసారి రాబోతున్న సాంగ్ మెలోడీ బీట్స్‌లో ఉంటుందట. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా అన్నోన్స్ చేశారు. మూడో సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు..ఫిలిం వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం మూవీలో ఈ మెలోడీ సాంగ్ అత్యంత కీలకంగా ఉంటుందట. దర్శకుడు శంకర్‌ కాస్త ఎక్కువగానే ఖర్చు చేసి ఈ పాటను షూటింగ్ చేశారని గతంలో వార్తలొచ్చాయ్. మొత్తానికి గేమ్‌ ఛేంజర్‌ మూవీ అంచనాలు పెంచే విధంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ను ఈ నెల లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

రీసెంట్‌గా మేకర్స్ టీమ్ ప్రమోషన్స్ కోసం చరణ్ క్లాసిక్ లుక్ లో అట్ట్రాక్ట్ చేస్తున్న కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇంత‌లోనే మ‌రో భారీ అన్నౌన్స్మెంట్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో నిర్వ‌హించ‌నున్నామ‌ని మూవీ టీమ్ ప్ర‌క‌టించింది. దీంతో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుపుకుంటున్న‌ మొట్టమొదటి భారతీయ చిత్రంగా గేమ్ ఛేంజ‌ర్ రికార్డుల‌కెక్క‌నుంది.

గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ ఈవెంట్ డిసెంబర్ 21 న నిర్వహించనున్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి గేమ్ ఛేంజ‌ర్ మూవీ టోటల్ టీమ్ , టెక్నీషియ‌న్లు అమెరికా వెళ్తున్నారని టాక్. ఈ మెగా మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓ ఈవెంట్ కంపెనీకి అప్పగించారట. శంక‌ర్ మూవీ భారీ లెవెల్ లో మూవీ సెలక్షన్ ల్లోనే కాదు.. వాటిని మార్కెట్ చేసే విధానంతోనూ అట్ట్రాక్ట్ చేస్తుంటాడు. భారీ బ‌డ్జెట్ మూవీలను ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మైలేజ్ సాధ్య‌మో డైరెక్టర్ శంకర్‌కు ఐడియా ఉంది. ప్రజెంట్ మరోసారి ఆ స్టాటజీ అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ ను నార్త్ ఇండియా లక్నో లో ఈవెంట్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ తో గేమ్ ఛేంజర్ మూవీపై మ‌రింత హైప్ పెరుగుతుంది.

మొత్తానికి స‌రైన స‌మ‌యంలో అనుకున్నట్లుగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా గ్లోబల్ లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ మూవీతో అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ తో కంబ్యాక్ అవ్వాల‌ని చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు శంక‌ర్. దిల్ రాజు లాంటి మాస్ట‌ర్ మైండ్ శంకర్ తో ఉన్నదీ కాబ‌ట్టి గేమ్ ఛేంజ‌ర్ మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలుస్తుందని ఈ మూవీతో శంకర్ కూడా కంబ్యాక్ అవుతారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి గేమ్ ఛేంజర్ మూవీ ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందనేది, మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version