Site icon Prime9

The Elephant Whisperers: ఆస్కార్‌ గెలిచిన భారతీయ చిత్రం.. చరిత్ర సృష్టించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్!

the elephent whisperers

the elephent whisperers

The Elephant Whisperers: ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. మహిళా డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ మూవీని తెరకెక్కించారు.

సత్తా చాటిన ఎలిఫెంట్ విస్పరర్స్.. (The Elephant Whisperers)

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు. ఇక భారతీయ చిత్రం ఆస్కార్ వేడుకల్లో మెరిసింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ వేడుకలో కార్తీకి ఆస్కార్ ను సగర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం.

డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో.. ఆల్ దట్ బ్రీత్స్ తో పాటు.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆల్ దట్ బ్రీత్స్ ఆస్కార్ ను అందుకోలేకపోయింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ మాత్రం ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. 1969 నుంచి ఇప్పటి వరకు షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు సార్లు భారతీయ సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. 1969 లో ప్రముఖ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ ఫాలీ బిలిమోరియా తెరకెక్కించిన ‘ది హౌస్ దట్ ఆనంద బిల్ట్’బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. ఆ తరువాత 1979 లో యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ బెస్ట్ డాక్యుమెంటరీ కి నామినేట్ అయ్యింది. దాదాపు 43 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఈ డాక్యుమెంటరి నామినేట్ అయి.. ఆస్కార్ గెలుచుకుంది.

ఎలిఫెంట్ విస్పరర్స్ కథ ఇదే..

ఇప్పటివరకు ఇండియన్ స్టార్స్ ఎంతోమంది ఆస్కార్ గెలుచుకున్నారు. కానీ అవన్నీ ఇంగ్లీష్ సినిమాకు వర్క్ చేసినవే. ఏ ఇండియన్ సినిమా ఏ కేటగిరీలో ఇప్పటి వరకు ఆస్కార్ అందుకోలేదు. మొదటిసారి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విషయానికి వస్తే.. ఓ అడవిలో చిన్న గ్రామం. వయసుమళ్ళిన జంట ఒక అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటారు. ఆ ఏనుగు పిల్లతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్ల, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా నేడు ఆస్కార్ ని కూడా అందుకుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది చూసేయండి.

Exit mobile version