Site icon Prime9

Singer Revanth: తండ్రి అయిన టాలీవుడ్ సింగర్ రేవంత్

singer-revanth-blessed-with-baby-girl

singer-revanth-blessed-with-baby-girl

Singer Revanth: టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్నాడు. తనదైన శైలిలో బిగ్ బాస్ రియాల్టీ షోలో రాణిస్తున్నాడు. బిగ్ బాస్ లోకి వచ్చే నాటికే అన్విత నిండు గర్భిణి. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమె సీమంతం జరిగింది. తన భార్య సీమంతం వీడియోను చూసి రేవంత్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఎమోషన్ తో కన్నీరు పెట్టుకున్నాడు.

చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని, తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని అందుకే ‘నాన్నా’ అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా అనే ఆత్రుతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు. ఇప్పుడు ఆయన కల నెరవేరింది. నాన్నా అని పిలిచేందుకు రేవంత్ ఇంట చిన్నారి అడుగుపెట్టింది. తనకు కూతురు పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎంత సంతోషిస్తాడో అని ఆయన అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతూ రేవంత్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు మరియు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేవంత్ కావాలంటూ ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి:  బైక్ రైడ్‌లో అదరగొట్టిన నారా బ్రాహ్మణి.. వైరల్ అవుతున్న వీడియో

Exit mobile version