Site icon Prime9

Jabardasth Show : జబర్దస్త్ లో అందరూ చూస్తుండగానే కృష్ణ భగవాన్ కి కిస్ ఇచ్చిన యాంకర్ సౌమ్యరావ్..

jabardasth show latest promo goes viral on social media

jabardasth show latest promo goes viral on social media

Jabardasth Show : బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వెండి తెరపై కూడా తమదైన శైలిలో నటిస్తూ పలు అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. కాగా ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు, కృష్ణ భగవాన్‌ ల మధ్య చోటు చేసుకున్న కిస్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ఇంద్రజ ఆమెని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా షాకిచ్చిందీ ఈ కొత్త యాంకర్‌. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

కాగా గతంతో పోలిస్తే జబర్దస్త్ షో కి ఇప్పుడు కొంచెం క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. జబర్దస్త్ షో కి అనసూయ గుడ్ బై చెప్పినప్పటి నుంచి యాంకర్ గా సౌమ్యరావు అలరిస్తుంది. ఇక షో లో కృష్ణ భగవాన్‌, సౌమ్య రావులు పంచ్‌లతో ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ వచ్చే వారం ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో అందరి స్కిట్లు నవ్వులు పూయించాయి. ముఖ్యంగా నూకరాజు చేసిన ఛార్లీ చాప్లిన్‌ ఇమిటేషన్‌ స్కిట్‌ అదరగొట్టింది అని చెప్పాలి.

అయితే ఈక్రమంలో నూకరాజుని యాంకర్‌ సౌమ్య రావు ఫాలో అయ్యింది. ప్రసాద్‌ చేయాల్సిన పనులు ఆమె చేస్తూ వచ్చింది. దీంతో నూకరాజు జబర్దస్త్ జడ్జ్ కృష్ణ భగవాన్‌ వద్దకి వెళ్లి ఆయన ముగ్గకి ముద్దు పెట్టాడు. ఇది చేయాలని ఇప్పుడు సౌమ్య రావు చేయాల్సి వచ్చింది. అయితే ముద్దు పెట్టేందుకు వచ్చిన కృష్ణ భగవాన్‌ని రేటింగ్‌ ఫ్లకార్డ్ తో అడ్డు పెట్టింది మరో జడ్జ్ ఇంద్రజ. అయినా లెక్కచేయలేదు సౌమ్య రావు. అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇస్తూ ఆమె కృష్ణ భగవాన్‌కి బుగ్గకి ముద్దు పెడుతుందనుకున్నారు. కానీ ఆమె ఆయన చేయిని తీసుకుని వేళ్లకి ముద్దు పెట్టింది. దీంతో అంతా షాక్‌ అయ్యారు. సౌమ్య రావు ఇంతటి సాహసం చేస్తుందా అని ఆశ్చర్యపోయారు.

ఇక ఇదే ఛాన్స్ అనుకోని మరో చిలిపి పని చేశాడు కృష్ణ భగవాన్‌. ఇలాంటి సందర్భాల్లో రెచ్చిపోయి కామెడీ చేసే ఆయన సౌమ్య రావు ముద్దు పెట్టిన తన చేతి వేళ్లకి అదే ప్లేస్‌లో తను ముద్దు పెట్టుకోవడం విశేషం. ఆ ఒక్క సంఘటనతో అటు సౌమ్య రావు, ఇటు మరో జడ్జ్ ఇంద్రజ షాక్‌ అయ్యారు. అది చూసిన కమెడియన్లు మాత్రం గట్టిగా అరుస్తూ హోరెత్తించారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో ఈ కిస్ మ్యాటర్  స్కిట్‌ హైలైట్‌గా నిలిచింది. అయితే ఇటీవల ఈ షోకి క్రేజ్‌ తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రోమో మళ్ళీ హైలైట్ అవుతూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.

Exit mobile version
Skip to toolbar