Site icon Prime9

Gruhalakshmi: నవంబర్ 02 ఎపిసోడ్ లో కొత్త కథ మొదలెట్టిన తులసి!

gruhalakshmi nov 02 prime9news

gruhalakshmi nov 02 prime9news

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ఆ మాటతో తులసి తల్లి ‘మా తులసి ఎప్పటికి ఒంటరి కాదు. తనతో తాను కలిసి ఉంటుంది. తులసికి తోడు తులసే’ అని సినిమా రేంజులో డైలాగ్స్ చెబుతుంది. ఇది ఇక్కడ ఉంటే యుద్ధం. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆకాశం అని నా మైండ్ పని చేయనివ్వకుండా చేస్తుందోమో అనుకున్నా. తులసి ఈ ఇంట్లో ఉండను అనేసరికి, సరే ఇంకా నుంచి నీ ఇష్టం అని అనేస్తుంది ఆమె తల్లి. ‘జీవితంలో మొదటిసారి నీ కోసం నువ్వు బతుకుతున్నావ్ అని అంటుంది అలాగే ధైర్యంగా నువ్వు ముందుకు అడుగువేయి, నీ ఎదుగుదల పైనే ధ్యాస పెట్టమ్మా’ అని కూతురుకు మంచి మాటలను చెబుతుంది.

‘కొత్త కథని రాయడం మొదలు పెట్టు, మర్చిపో ఇక నీ పాత కథని చేదు గతాన్ని, నువ్వూ ధైర్యంగా ముందుకు అడుగెయ్. ఈ ప్రపంచాన్ని గెలిచే వరకు నీ పోరాటాన్ని ఆపకు కొత్తదనం కనిపించాలి అడుగడుగునా, తులసీ ఏమి అనుకున్నా అది సాధించాలి. ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధించాలి’ అనుకుంటూ ఉంటుంది. ఆమె వెనుక ఆ నలుగురు సామ్రాట్, ప్రేమ్, దీపక్, తల్లి నిలబడటం. ఆ సీన్స్ లో ఎలివేషన్స్ మామూలుగా లేవు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version