Bigg Boss 6: మెదటి వారం జరిగిన అన్ని సన్నివేశాలను మనతో మరియు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ తోనూ ముచ్చటించడానికి హోస్ట్ నాగ్ వచ్చేశారు. కంటెస్టెంట్లు చేసిన తప్పుఒప్పులేంటి.. వారి ఆటను ఎలా మార్చుకుంటే బాగుంటుందో వారికి శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున వివరించారు. ఎలిమినేషన్ నుంచి ఇద్దరిని సేఫ్ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరు.. నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పిన సలహాలేంటో చూసేద్దామా..
బిగ్ బాస్ స్టేజ్ మీదకు రాగానే నాగార్జున ఆనందం వ్యక్తం చేశాడు. దానికి కారణం ఈ సారి బిగ్ బాస్ వీకెండ్ షోకి ప్రేక్షకులు కూడా వచ్చారు. కరోనా వల్ల గతేడాది ఆడియన్స్ ని తీసుకురాలేకపోయామని ఈ సారి ప్రేక్షకలను మధ్య షో చెయ్యడం హ్యాపీగా ఉందని నాగ్ చెప్పాడు. బిగ్ బాస్ హోస్ట్‌గా తనకున్న అనుభవంతో ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న 21 మంది ఆట తీరును నాగార్జున చక్కగా వివరించాడు. అంతేకాకుండా వారి లోపాలను తనదైన శైలిలో ఎత్తిచూపారు. మొదటి వారం ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగురి ఇంటి సభ్యుల నుంచి ఇద్దరిని సేఫ్ చేశాడు కూడా.
మరి కంటెస్టెంట్స సంగతికొస్తే
- సింగర్ రేవంత్ ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నాడని, వాటిని తగ్గించుకోవాలని.. అలాగే మెచ్యూర్డ్‌గా ఉండాలని సలహా ఇచ్చాడు.
- ఇక గలాట గీతు ఆట తీరును మెచ్చుకుంటూనే.. ఆమె మాట తీరును తప్పుపట్టాడు. నువ్ అలా పదే పదే ఇనయాను తిక్కల్దానా అని అంటే.. నువ్ తిక్కల్దానివి అని ప్రజలు అనుకుంటారని.. నవ్వుతూనే అసలు విషయం చెప్పేశాడు. దానికి గీతూ అవును సర్ నాకు కాస్త తిక్క ఉందిని రివర్స్ కౌంటర్ వేసింది. పదేపదే సంబంధం లేని విషయాల్లో దూరితే జైల్లో పెడతారు అనే సరికి ఇంటి సభ్యులు నవ్వారు.
- ఇంక ఫైమాపై నాగార్జున ప్రశంసలు కురిపించారు. ఫస్ట్ వీక్‌లోనే బెస్ట్ సంచాలక్‌గా నిరూపించావని… ప్రతివారం నాతో ఇలాగే ఫేమస్ ఫైమా అనిపించుకోవాలని చెప్పాడు.
- మరి బిగ్‌బాస్ క్యూట్ కపుల్ రోహిత్, మెరీనాల ఆట తీరును మెచ్చుకున్న నాగ్.. రోహిత్ హగ్ ఇవ్వడం లేదని బాధపడుతున్న మెరీనాను అర్థం చేసుకొని దగ్గరుండి మరీ హగ్ ఇప్పించాడు.
- ఆదిరెడ్డిని రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడాలని… కొరియోగ్రఫీలోనే కాదు స్నేహం చేసుకోవడంలోనూ ఫాస్ట్‌గా ఉండాలని అభినయశ్రీకి చెప్పాడు.
- కీర్తి భట్ ఆట తీరు బాగుందని, అయితే ఎవరో చెప్పారు కదా అని శ్రీహాన్‌ని బ్రో అని పిలవొద్దని, తనకి నిజంగా అనిపిస్తేనే అలా పిలవాలని సలహా ఇచ్చాడు.
- అర్జున్ కల్యాణ్‌ని బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు.
- సూర్యని అయితే… నీ ఆట తీరు బాగుందని.. ఎవరికి ఆకలి వేసినా ఇబ్బంది పడకుండా వండుకొని తీసుకొచ్చి తినిపిస్తున్నావని మెచ్చుకున్నాడు.
వీరితో పాటు మిగిలిన ఇంటి సభ్యుల పొరపొచ్చాలను కూడా నాగ్ సవివరంగా చెప్పారు. ఆ తర్వాత ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగురిలో నుంచి శ్రీసత్య, చంటీలను సేవ్ చేశాడు. ఇక రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ ఈ ఐదుగురిలో ఎవరు బయటకు వెళ్తారనేది నేటి ఎపిసోడ్ చూస్తే కాని తెలియదు. అయితే సోషల్ మీడిలో వస్తున్న ఓటింగ్ ప్రకారం ఇనయాకు బయటకు వెళ్లేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కానీ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేము కాబట్టి ఎవరు బయటకు వెళ్తారనే విషయం తెలిసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
ఇదీ చూడండి: Bigg Boss season 6: బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ ఏవరంటే ?