Site icon Prime9

Bigg Boss 7 elimination : డేంజర్ జోన్ లో వుంది వీళ్ళే ..ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

details about bigg boss 7 eliminations

details about bigg boss 7 eliminations

Bigg Boss 7 elimination : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 జనాలలో మంచి ఆదరణ పొందుతు ఇప్పటికి ప‌దో వారం ముగింపు వరకు వ‌చ్చేసింది. తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్‌, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో న‌యని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ మాస్ట‌ర్, తొమ్మిదో వారంలో టేస్టీ తేజాలు ఎలిమినేట్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయ్యారు . అయితే వీరిలో ర‌తిక రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు సాగిన దానికి మించి కొత్తగా జరగబోతున్నాయి . ఇయితే వీరిలో ఒకరు బయటకు వెళ్ళే సమయం వచ్చేసింది .

ఇప్పుడు ప‌దో వారంలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వారంలో గౌతమ్ కృష్ణ, రతిక, ప్రిన్స్ యావర్, భోలే షావలి, శివాజీ నామినేషన్లలో ఉన్నారు. వీరిలో శివాజీ ని ఈ వారం కెప్టెన్ గా ఎన్నుకున్నారు . ప్రస్తుతం ర‌తిక రోజ్‌, భోలే షావ‌లి లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు అన‌ధికార ఓటింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో ర‌తిక ఎలిమినేట్ అవుతుంద‌ని చాలా మంది భావించారు. అయితే.. రితిక లాస్ట్ వీక్ ఆడియన్స్ ని ఒక్క ఛాన్స్ అని అడిగిన పద్ధతికి ఈ సారి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ వున్నట్టు తెలుస్తుంది . ఇంకా తరువాత లిస్ట్ లో వున్న పాట బిడ్డ భోలే షావ‌లి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రానున్నాడ‌ని టాక్‌.

వాస్త‌వానికి టాస్క్‌ల ప‌రంగా భోలె కూడా పెద్ద‌గా ఆడింది లేదు. అయితే.. త‌న‌దైన పాట‌ల‌తో మాత్రం ఆక‌ట్టుకుంటున్నాడు. అప్ప‌టిక‌ప్పుడు పాట‌ల‌ను అల్లుతూ అవ‌లీల‌గా పాడేస్తున్నాడు. జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు . కాగా ప‌దో వారంలో అత‌డు ఎలిమినేట్ అయ్యాడ‌ని అంటున్నారు. చూడాలీ మ‌రీ ఇందులో ఎంత నిజం ఉంది అన్న‌ది. భోలెనే ఎలిమినేట్ అయ్యాడా..? లేక మ‌రెవ‌రు అయినా ఎలిమినేట్ అయ్యారా..? అన్న‌ది పూర్తి ఎపిసోడ్ ప్ర‌సారం అయితే గానీ తెలియదు. అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

Exit mobile version