Site icon Prime9

Bigg Boss season 6: బిగ్ బాస్ మోడల్ రాజశేఖర్ ఎవరు ?

big boss rajashekhar prime9news

big boss rajashekhar prime9news

Bigg Boss Season 6: సెప్టెంబర్ 4న బిగ్ బాస్  సీజన్ 6 తెలుగులో ప్రారంబమయిన సంగతి మన అందరికీ తెలిసిందే.  ఈ  సీజన్ కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్ బాస్  ఇంట్లోకి  మొత్తం 21 మంది కంటెస్టెంట్స్  అడుగుపెట్టిన విషయం తెలిసిన సంగతే. ఈ  షోలో బాగా పాపులర్  ఐనవాళ్ళకు  మాత్రమే అవకాశం ఉంటుంది. షోస్, సీరియల్స్, సినిమాల ద్వారా అభిమానులకు  దగ్గరగా ఉండే వాళ్ళు, అభిమానులకు  పరిచయం లేని వారు  కొందరు, ఇంకొందరు అసలు తెలియని వారిని తీసుకుంటారు. ఐతే  ఇప్పుడు  ఇదంత ఎందుకు  చెప్తున్నానంటే బిగ్‏బాస్ షోలో 18వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మోడల్ రాజశేఖర్ గురించి అందరికీ తెలియదు. మోడల్‏గా మంచి క్రేజ్ ఉన్నా మనలో చాలామందికి ఈయన ఎవరో కూడా  తెలీదు. ఒక  మోడల్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజశేఖర్ తన జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను , సమస్యలను   ఎదుర్కోన్నారు.

రాజశేఖర్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాద్యతలు తన భుజానా వేసుకున్నారు. అతను మోడల్ కాక ముందు వరకు ఒక ఆఫీసులో ఆఫీసు భాయ్ గా పని చేశారు. అక్కడ ఎంత పని చేసిన ఇలాగే ఉంటామని, ఈ జాబ్  తనకి తగినది కాదని తెలుకున్న రాజశేఖర్ ఒక నిర్ణయం తీసుకొని డానికి కట్టుబడి ఉండి తన అడుగులు మోడల్ వైపు తన  ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అప్పుడు  మోడలింగ్ కు కావాల్సిన అర్హతలు నేర్చుకొని బాడీ  ఫిట్ నెస్ కు శిక్షణ తీసుకొని మోడల్ గా గొప్ప పేరును, తెచ్చుకున్నారు. జీవితంలో గెలిచిన రాజశేఖర్ బిగ్‏బాస్ ఇంట్లో కూడా గెలుస్తారా అనేది చూడలిసి ఉంది. సినిమాలో నటించాలనే  కల కోసం బిగ్ బాస్ షో కి వచ్చినట్టు తెలిపారు.

Exit mobile version