Site icon Prime9

Bigg Boss Season 6 : హౌస్ నుంచి నేను బయటికి వెళ్లిపోతానంటున్న సింగర్

singer-revanth

Bigg Boss Season 6: బిగ్ బాస్ ఇంట్లో రచ్చ మామూలుగా లేదు. షో మొదలైన ఐదు రోజుల్లోనే ఇంట్లో హౌస్ మేట్స్ మధ్య తిట్లు, కొట్లాటలు, గొడవలు ఒక రేంజుకు వెళ్లిపోయాయి. బిగ్ బాస్ ఈ సారి ఎంటర్టైన్మెంటుకు గట్టిగా ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇప్పటికే మెరీనా-రోహిత్ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ గొడవలు ముదిరేలా చేసి, వాళ్ళ మధ్యలో వేరే వాళ్ళను ఇరికించి చీటికీమాటికి వాళ్ళు గొడవలు పడేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ప్రతి రోజు బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య ఏదో ఒక చిచ్చు పెడుతుంటారు. సోషల్ మీడియాలో గలటా గీతును ట్రోల్స్ చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆమె మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుందని, ఈమెను తొందరగా ఇంటి నుంచి బయటికి పంపిస్తే మిగతా హౌస్ మేట్స్ కు మంచిదని, ఈమె బాష కూడా మంచిగా లేదు, హౌస్లో ఉంచడం కరెక్ట్ కాదని ఇలా పలు రకాల విమర్శలు వస్తున్నాయి.

మొదటి వారం కెప్టెన్ కోసం 21 కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. గలాటా గీతు ఐతే కెప్టెన్సీ కోసమే తన గొంతును పెంచి గట్టి గట్టిగా ఇంట్లో అరుస్తుంది. అరోహి విషయానికి వస్తే నలుగురు ముందు పంచాయితీ పెట్టి, సింగర్ రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దానికి రేవంత్ కు కోపం వచ్చి గట్టిగానే అరిచాడు. బిగ్ బాస్ ఇంట్లో మొదటి రోజే నుంచే హౌస్ మేట్స్ అందరూ సింగర్ రేవంతును టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. దానితో సింగర్ రేవంత్, బిగ్ బాసుకు చెప్పి ఇప్పటికిప్పుడు నేను బయటికి  వెళ్లిపోతా అంటూ కొత్త పంచాయితీ పెట్టాడు. వీళ్ళ పంచాయితీకి పరిష్కారం తరువాత ఏపిసోడులో తెలుస్తుంది.

Exit mobile version