Site icon Prime9

Boss Season 6 : గీతూ మీద నోరుపారేసుకున్న సింగర్ రేవంత్

big boss today 13 prime9news

big boss today 13 prime9news

Big Boss Season 6: బిగ్ బాస్ ఆట రోజు రోజుకు ఆసక్తి కరంగా మారుతుంది.బిగ్ బాస్ ఏ సమయంలో ఎవరెవరికి గొడవలు పెడతారో తెలీదు అలాగే ఏ సమయంలో ఎవరు గొంతెత్తి మాట్లాడతారో తెలీదు. నిన్నటి వరకు సైలెంటుగా ఉన్న రాజశేఖర్ ఒక్కసారిగా తన కోపాన్ని మొత్తాన్ని బయటికి వెళ్ళగక్కాడు.రెండో వారం నామినేషన్స్‌లో భాగంగా రాజశేఖర్ గట్టిగా విరచుకు పడ్డాడు.బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ బాలాదిత్య తనకు ఇచ్చిన స్పెషల్ పవర్‌ను సరిగా ఉపయోగించుకోలేదనే అనిపిస్తుంది.ఎందుకంటే పనికిరాని కారణాలు చెప్పి ఇద్దరినీ నామినేట్ చేసి తన అసమర్థతను చాటుకున్నాడు.తను నామినేషన్ చేసిన ఇంటి సభ్యులు రేవంత్ మరియు గీతూ.ఈ ఎపిసోడ్లో రేవంత్ గీతూ ఫైట్ ఒక రేంజుకు పోయి బాగా ముదిరిపోయింది. జరిగిన నామినేషన్ల మొత్తంలో రేవంత్, గీతూ మాటల యుద్దం వీర లెవెల్లో వీళ్ళు గొడవలు పడ్డారు.

ముందు రేవంత్‌ని గీతూ నామినేట్ చేసి, నీకు కోపం ఎక్కువ తగ్గించుకుంటే మంచిది,కామెడీ చేయమంటే ఓవర్ కామెడీ చేస్తున్నావ్ ? నేనుమీ వల్ల మీ కామిడీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానని రేవంత్ మొహం మీద చెప్పేసింది.ఇప్పుడు రేవంత్ వంతు వచ్చేసింది తన వంతు వచ్చాక తను గీతూని నామినేట్ చేయకుండా ఉంటాడా ? ఆమెను నామినేట్ చేశాడు. నిన్ను నామినేట్ చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు కానీ నువ్వు ఏమి మారలేదు ?నువ్వు ఇంకా అలాగే మాట్లాడుతున్నావ్ ? నువ్వు మాట్లాడవని నేను మాట్లాడితే నీకు నాకు ఏం తేడా ఉంటుందని రేవంత్ తన స్టైల్లో రెచ్చిపోయి ఛీ నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం,బురద మీద చిన్న రాయి వేసినా మన మీదే పడుతుంది నువ్వు కూడా ఆ జాతికి చెందిన ఆమేవె అంటూ ఇస్టం వచ్చినట్టు గీతూ మీద విరచుకుపడ్డాడు.ఇలా ఇంట్లో ఉన్న సభ్యులు ఒకరికొకరు నామినేషన్స్ చేసుకుంటూ ఈ ఎపిసోడ్ గొడవలు మధ్య సాగిపోతుంది.

ఇంకా మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి: Big Boss season 6: స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్ సొంతం చేసుకున్న బాలాదిత్య

Exit mobile version