Site icon Prime9

Singer Revanth: బిగ్ బాస్ వేదిక పై గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ రేవంత్

revanth prime9news

revanth prime9news

Big Boss Season6: బాహుబలి తర్వాత సింగర్‌ రేవంత్‌ కెరియర్ మారిపోయింది. ఒక్క పాటతో ఎక్కడికో వెళ్ళాడు. అలాగే సింగర్ రేవంత్ పాడిన పాటలు ఒకటా, రెండా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద సినీమాల్లో తను పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్‌ హిట్‌ సినిమాల్లో పాటలు పాడి తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి పార్ట్ 1 సినిమాలో మనోహరీ అనే ఒక్క పాటతో ఏ రకంగా క్రేజ్‌ తెచ్చుకున్నారో మన అందరికీ తెలిసిందే. 2017లో ఇండియన్‌ ఐడల్‌-9లో రేవంత్ పాల్గొని టైటిల్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రియాలిటీ షో ఐనా బిగ్‌బాస్‌ సీజన్‌-6లో తళుక్కున మెరిశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వేళ్ళ బోయే ముందు ఒక ఎమోషనల్‌ పోస్టును రేవంత్‌ తన సోషల్ మీడియాలో తన సతిమణిని బాగా మిస్ అవుతున్నట్లు ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకున్నారు.

ఇటీవలె రేవంత్ తన బ్యాచ్లర్ జీవితానికి టాటా చెప్పి అన్విత అనే అమ్మాయిను వివాహమాడారన్న విషయం మన అందరికీ తెలిసిందే. తన సోషల్‌ మీడియా ద్వారా అన్వితతో కలిసి ఉన్న ఫోటోలన్ని ఇన్‌స్టాగ్రామ్లో షేర్‌ చేస్తూనే ఉంటారు. బిగ్ బాస్ వేదిక మీద తన సతీమణి గురించి మన అందరితో ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు రేవంత్‌ భార్య అన్విత గర్భవతని, ఇలాంటి సమయంలో నేను తన పక్కన ఉండి తనని మంచిగా చూసుకోవాలి. కానీ అలా చూసుకోలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందంటూ బిగ్ బాస్ వేదిక పై రేవంత్‌ చాలా ఎమెషనల్‌ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో సింగర్ రేవంత్ అందరికి గట్టిగా పోటీ ఇవ్వాలని, అలాగే అతను గెలిచి ఇంటికి రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Exit mobile version