Site icon Prime9

Bigg Boss: లాస్ట్ వీక్ భార్య ఈ వీక్ భర్త.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్ అవుతాడా..?

Is rohit shahni eliminates in-12th-week of bigg-boss-6-telugu

Is rohit shahni eliminates in-12th-week of bigg-boss-6-telugu

Bigg Boss: బుల్లితెర నాట బిగ్ బాస్ షో అశేష ప్రజానికాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే ఏరోజు ఏం జరుగుతుందా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే ఉత్కంఠతతో ఆరో సీజన్‌లోని పన్నెండో వారం నామినేషన్స్ ఉన్నాయి. అయితే ఈ వారం నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయని ఆఖరికి రోహిత్ సాహ్ని ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకుల అభిప్రాయం. మరి ఎందుకు రోహిత్ ఎలిమినేట్ అనేది ఓ సారి చూసేద్దాం.

ఈ వారం నామినేషన్స్ టాస్క్ కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా నిర్వహించారు బిగ్ బాస్. ఇక, ఈ వారానికి జరిగిన టాస్క్‌లో ఇనాయా సుల్తానా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీహాన్ చోటూ, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు. అయితే, ఈ వారం రేవంత్ కెప్టెన్ అవడం వల్ల సేఫ్ అవగా.. ఎవరూ నామినేట్ చేయని కారణంగా కీర్తి భట్ కూడా ఈ ప్రక్రియ నుంచి తప్పించుకుంది.

ఈ సీజన్ ముగింపుకు చేరుకుంటున్న దశలో ప్రేక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునే క్రమంలో పోటీపడి ఓటింగ్ వేస్తున్నారట. కాగా పన్నెండో వారానికి జరిగిన ఓటింగ్‌లో ఇనాయా సుల్తానా మొదటి స్థానంలోనే ఉందని సమాచారం. ఆమె తర్వాత రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో రోహిత్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాజశేఖర్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో ఫైమా ఉన్నట్లు కూడా తెలిస్తోంది. అయితే ఈ వారం డేంజర్ జోన్లో ఫైమా, రాజశేఖర్ మొదిటి రెండు స్థానాల్లో ఉండగా వీళ్లతో పాటు శ్రీ సత్య, రోహిత్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వీళ్ల ఓటింగ్‌లో తేడా చాలా తక్కువగా ఉండడమేనట. అంటే ఈ నలుగురిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే, ఎలిమినేషన్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.  ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రాజ్, రోహిత్‌లలో ఒకరు వెళ్తారు. ఫైమాకు ఎవిక్షన్ పాస్ ఉండడం వల్ల దానితో ఎలిమినేషన్ నుంచి ఆమె సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా మొత్తానికి ఈ సీజన్‌లో తొలిసారి సెన్సేషనల్ వీక్ కాబోతుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున వస్తే కానీ తెలియదు.

ఇదీ చదవండి: మెరీనా అవుట్.. కన్నీటి పర్యంతమైన రోహిత్

 

Exit mobile version