Site icon Prime9

Bigg Boss Season 6: ఇనయాపై శ్రీహాన్, రేవంత్ గొడవ… “వాడు వీడు ఏంటి… లాగి కొడితే” అంటూ ఫైర్

big boss 6 latest episode promov

big boss 6 latest episode promo

Bigg Boss Season 6: బుల్లితెర నాట బిగ్ బాస్ సంచలం సృష్టించిందనే చెప్పవచ్చు. కాగా మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్6 నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాగా ఈ సీజన్లోని హౌస్ మేట్స్ అందిరిలోకి బాగా వినిపించే గొంతులు మాత్రం రేవంత్, ఇనయా, గీతూలవే. వీళ్లే ఎక్కువగా హౌస్లో మాట్లాడుతుంటారు. అయితే నిన్న జరిగిన టాస్క్ లో ఎక్కువ మంది ఇనయానే నామినేట్ చేశారనేది మనం చూసాం. కాగా మరి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుంది అనే హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

అసలేమైందంటే బిగ్ బాస్ హౌస్ మేట్లకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారు. అయితే అడవిలో ఆట అని ఇచ్చి ఈ టాస్క్‌లో కొంతమంది ఇంటి సభ్యులను పోలీసులుగా, మరి కొంతమందిని దొంగలుగా వ్యవహరించమని చెప్పారు బిగ్ బాస్. ఇక గీతూ ‘అత్యాశ గల వ్యాపారి’గా ఈ ఆటలో ప్రవర్తిస్తుంది. ఆట ఏంటో పూర్తిగా తెలియదు కానీ పోలీసులుగా మెరీనా, రోహిత్, శ్రీ సత్య, ఇనయా, ఆదిరెడ్డి, చంటి, బాలాదిత్య వ్యవహరించారు. ఇక మిగతా వారంతా దొంగలు. ఈ ఆటలో దొంగలంతా వస్తువులు దాచేస్తూ ఉంటారు వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.

ఈ క్రమంలో ఆరోహి ఆట ఆడుతూ గాయపడుతుంది. తనను ఎత్తుకుని తీసుకెళ్లారు. ఇంతలో ఇనయా ఆ విషయంపై అరస్తూ ‘నొప్పి అని స్ట్రాటజీలు యూజ్ చేస్తూ తీసుకెళ్లిపోతే…’అనగానే దానికి శ్రీసత్య ‘ఆమెకు నిజంగానే కాలికి దెబ్బ తగిలింది అంటుంది. వెంటనే ఇనయా ‘ఉంది… ఆమెను లాగింది వాడు’అంటూ శ్రీహాన్ ను చూపిస్తుంది. అంతే ఇంక శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ ఇనయాతో గొడవ పెట్టుకుంటారు. మరి ఈ గొడవ ఎలా ఎక్కడి వరకు వెళ్తుందో నాగార్జున వస్తేకానీ తెలియదు. కానీ ఈ గొడవ ఎఫెక్ట్ మాత్రం వచ్చే శనివారం ఎపిసోడ్లో బాగానే కనిపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మరి నిన్న వాడివేడిగా జరిగిన నామినేషన్ల ఎపిసోడ్లో మొత్తం తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అవడం చూశాం.

ఇదీ చదవండి: Bigg Boss Season 6: ఇనయానే టార్గెట్… శ్రీ సత్య ఆ మాట వెనుక దాగిన నిజం ఏంటి..?

Exit mobile version