Site icon Prime9

Bigg Boss 6 : వెళుతూ వెళుతూ రేవంత్ పరువు తీసిన సుదీప

sudhipa prime9news

sudhipa prime9news

Bigg Boss 6 : ‘బిగ్ బాస్’ సీజన్ 6 నుంచి నిన్నటి వారంలో ‘పింకీ’ సుదీప ఎలిమినేట్ అయ్యారు.ఈమె ఎలిమినేట్ అవుతుందనే ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.ఐతే ,ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది..బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత లోపల ఉన్న వారిపై సుదీప్ ఎలాంటి కామెంట్స్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం. ఎలిమినేషన్ ప్రక్రియ,నాగార్జున హౌస్ మేట్స్ తో చేసిన ఫన్‌ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.

నాగార్జున సుదీప ఎలిమినేషన్ను ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు.ఐతే , చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లేటప్పుడు కనిపించలేదు.చక్కగా..నవ్వుతూ సుదీప బయటికి వచ్చేసింది.ఆమెకు స్వాగతం చెప్పిన నాగార్జున.. మన టీవీలో ఆమె జర్నీని చూపించారు.హౌస్ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకు నాగార్జున ఒక టాస్క్ ఇస్తారు కదా సుదీపకు కూడా అలాగే ఒక తోపుడు బండిపై కూరగాయలు పెట్టి, వాటి లక్షణాన్ని తగ్గట్టు పేర్లు పెట్టి అవి ఎవరికి సెట్ అవుతాయో చెప్పమన్నారు.ఇదే క్రమంలో మిరపకాయకి షార్ప్ టంగ్ అని రాసుంటే దాన్ని రేవంత్‌కు ఇచ్చింది. గతంలో హౌస్‌లో కిచెన్ దగ్గర రేవంత్‌తో సుదీప గొడవపడిన విషయం మన అందరికీ తెలిసిందే. తాను కెప్టెన్ అయితే అందరినీ మార్చిపారదొబ్బుతా అని రేవంత్ అన్నాడు. ఈ మాటలను సుదీప గుర్తు చేసుకొని ‘‘మార్చిపడేస్తా అన్నావుగా కిచెన్ టీం ని కానీ.. పాపం నీకు ఆ అవకాశం రాలేదు, మార్చిపడదొబ్బుతా అన్నావ్’’ అంటూ నవ్వుతూనే రేవంత్‌కు చురకలంటించి పొగ పెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

Exit mobile version