Site icon Prime9

Bigg Boss 6: వైఫ్‌తో కలిసి ఆడటం కాదు.. అంటూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన ఆదిరెడ్డి

big boss adi reddy prime9news

big boss adi reddy prime9news

Big Boss 6: బిగ్ బాస్ శని,ఆదివారం ఒక ఎత్తు ఐతే సోమవారం జరిగే నామినేషన్స్‌ ఐతే ఇక చెప్పాలిసిన అవసరం లేదు. మాటల తూటాలతో, తిట్లతో, కొట్లాటతో బిగ్ బాస్ ఒక రేంజులో టాప్ లేచిపోతుంది. ఐతే గతవారం నామినేషన్స్‌లో పెద్ద పస లేకపోయినప్పటికీ ఈవారం నామినేషన్స్‌లో ఐతే ఆదిరెడ్డి హైలెట్ అయ్యాడు. సినిమా రివ్యూలు చెప్పడంతో దిట్ట అయిన ఆదిరెడ్డి. బిగ్ బాస్ ఆటను ఈ వారం వంటపట్టించుకున్నాడు. ఈ వారం నామినేషన్స్‌‌లోనే అసలైనా మజా, కిక్కు వచ్చేసింది. ఈ వారం ఆదిరెడ్డికి అందరికంటే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. బిగ్ బాస్ ఇంట్లో ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడం లేదని అందరూ కలిసి అతన్ని నామినేట్ చేశారు. ఐతే మెరీనా ఆదిరెడ్డిని నామినేట్ చేసే సమయంలో రోహిత్‌తో జరిగిన గొడవ ఈ సీజన్‌లోనే అది పెద్ద గొడవగా మారింది.ఇద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. వీళ్ళు ఏంట్రా బాబూ అనేట్టుగా ఇద్దరూ రెచ్చిపోయారు.

కిచెన్‌లో మేము ఇద్దరం ఇబ్బంది పడుతుంటే, మీరు ఏం చేశారు? అడిగినా సరే మీరేం చేయలేదు కదా అని అన్నది మెరీనా. దీంతో ఆదిరెడ్డి, ‘మీరు అప్పుడు అడగాలి కదా. మేడమ్ నాగార్జున గారు చెప్పినట్టు నేను కెప్టెన్‌గా ఫెయిల్ అయిన మాట నిజమే. కానీ మీ ఇద్దరితో జరిగిన పాయింట్‌లో తప్పు మాత్రం నాది కాదని గట్టిగా అరిచి చెప్పాడు. దీంతో రోహిత్, ‘నేను మాట్లాడొచ్చా అంటూ సీన్‌లోకి సంబంధం లేకుండా వచ్చి, ‘శుక్ర, శనివారాల్లో రూల్ ఏంటి? అని అడిగాడు. ఆ మాటతో ఆదిరెడ్డి, ‘తమ్ముడు నేను చెప్పేది మీకు అర్ధం కాలేదా?’ అని అన్నాడు. దీంతో రోహిత్ ‘నువ్ వాయిస్ రేజ్ చేస్తే నీ కంటే ఎక్కువ రేజ్ చేస్తా అని గట్టిగా అరిచాడు. ఆ మాటతో ఆదిరెడ్డి అయితే చెయ్ ఏ మాత్రం రేజ్ చేస్తావో చెయ్ అంటూ రోహిత్ మీదికి ఒంటి కాలి మీదకు దూసుకుని వచ్చాడు. ‘నీ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడు,  వైఫ్‌తో కలిసి ఆడటం కాదు అంటూ  ఇష్టం  వచ్చినట్టు రెచ్చిపోయాడు ఆదిరెడ్డి.

Exit mobile version
Skip to toolbar