Site icon Prime9

Bigg Boss 6 : గీతూలో ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా ?

big boss oct 31 prime9news

big boss oct 31 prime9news

Bigg Boss 6 : ఈ వారం బిగ్ బాస్ ఇంటిలో ఉన్న సభ్యులంతా నామినేషన్స్‌లో ఉన్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే.ఐతే నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేయకుండానే నిన్న ఆర్జే సూర్యను డైరెక్టుగా ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. సూర్య ఎలిమినేట్ ఐనట్టు శనివారం నాగార్జున ప్రకటించారు. ఇది నిజం ఎలిమినేషనేనా..లేక సూర్యను సీక్రెట్ రూమ్‌లో పెడతారా అని చాలా మంది అనుకున్నారు కానీ, సూర్య ఎలిమినేట్ అయినట్టు నిన్నటి ఎపిసోడ్‌లో కన్ఫర్మ్ అయిపోయింది. సూర్యను సగౌరవంగా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపించేశారు.

గేమ్ ఆడిస్తూ ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ చివరికి ఆదిరెడ్డి, మెరీనా మిగిలారు. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోవాలిసిందే..అని నాగార్జున చెప్పారు. కాసేపట్లో వస్తానని బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్‌లో మన గీతూ గారు నటనకు నంది అవార్డ్ ఇచ్చిన తప్పు లేదు.సోఫాలో కూర్చొని ఆదిరెడ్డి చేతిని గట్టిగా పట్టుకుని.. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోవద్దు అంటూ బోరున ఏడ్చేసింది. ‘‘నువ్వు ఇక్కడి నుంచి వెళితే…. నన్ను అర్థం చేసుకునేవారే ఉండరు. నువ్వు వెళ్లొద్దు ప్లీజ్అంటూ ఒక రేంజులో ఎమోషనల్ అయింది.నువ్వు వెళితే నా కోసం ఎవ్వరూ ఉండరు..నీకు లా ఎవ్వరూ స్టాండ్ తీసుకోరు’’ అంటూ గీతూ బాగా ఏడ్చింది.

Exit mobile version