Site icon Prime9

Bigg Boss 6: ఆదిరెడ్డి భార్య కవిత వీడియో వైరల్

big boss 12 oct prime9news

big boss 12 oct prime9news

Big Boss 6 : ఎక్కడో నెల్లూరు జిల్లా వరికుంటపాడు అనే చిన్న గ్రామం నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబర్ ఆదిరెడ్డి. బిగ్ బాస్ ఇంట్లో తన సత్తా చూపిస్తున్నాడు. మంగళవారం నాటి 38వ ఎపిసోడ్‌ ఆదిరెడ్డికి ఎప్పటికీ మర్చిపోలేని ఎపిసోడుగా మారిపోయింది. ఈ దెబ్బతో మన సార్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయినట్టే! ఆయనకు అంత బూస్టింగ్ ఇచ్చింది అతని భార్య కవిత.

ఆదిరెడ్డి యూట్యూబ్‌లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పేటప్పుడు, మధ్య మధ్యలో కవితా,  కవితా అంటూ చాలా సార్లు అంటూ ఉండేవాడు.ఈ కవిత ఎవర్రా బాబు అని చాలామంది అనుకునేవారు. చివరికి ఒకసారి ఆదిరెడ్డే చెప్పాడు.. కవిత అంటే ఎవరో కాదు నా భార్య అని, ఆ తరువాత కవిత కూడా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడంతో, ఆమెకు కూడా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండటం. ఆదిరెడ్డి చెల్లెలైన నాగలక్ష్మికి కూడా లక్షలాదిగా ఫాలోవర్స్ ఉండటం. ఇలా వీళ్ల ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం యూట్యూబ్ ఫ్యామిలీగా మారి పోయింది.

నిన్న వచ్చిన ఏపిసోడులో ఆదిరెడ్డి భార్య కవితతో పాటు, అతని కూతురు అద్వైత కూడా వీడియో కాల్‌లో కనిపించి ఆదిరెడ్డికి ఫుల్ ఎనర్జీ నింపేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారిన ఆదిరెడ్డిని ఇంకా ఫుల్ రీచార్జ్ చేశారు.

Exit mobile version