Site icon Prime9

Bigg Boss season 6: గీతూ బేబీ బొమ్మను దొంగిలించిన సింగర్ రేవంత్

geethu prime9news

geethu prime9news

Big Boss season 6: బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.టాస్క్ లో భాగంగా హౌస్లో ఉన్న ఇంటి సభ్యులకు బేబీ బొమ్మలను ఇచ్చి వాటిని కింద పడేయకుండా చూసుకోవాలని షరతు పెట్టారు. అలాగే ఎవరి బేబీ బొమ్మలను వాళ్ళే కాపాడుకోవాలని వాళ్ళకి కొత్త బాధ్యతలను అప్పజెప్పాడు. ఎవరి బేబీ బొమ్మ అయితే లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలోకి పడేస్తారో వారు టాస్క్ నుంచి తొలగుతారు. ఈ టాస్కులో గీతూ చాలా తెలివిగా ఆడుతుంది. తన తీరును మార్చుకొని అందరికీ చెమటలు పట్టించింది.

రేవంత్, శ్రీసత్య, అభినయ బేబీ బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేయడంతో వారు ఆట నుంచి తప్పుకున్నారు. అలాగే శ్రీహాన్ బేబీ బొమ్మను గీతూ దొంగిలించి, అర్జున్ కళ్యాణ్ బేబీ బొమ్మను శ్రీహాన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏరియాలో పడేశాడు. గీతూ ఆగడాలు చూడలేక ఇంటి సభ్యులందరు ఒక్కటై గీతూను ఓడించేందుకు ప్రయత్నించారు. గీతూ బేబీ బొమ్మను ఏలాగైనా దొంగతనం చేయాలని నానారకాలుగా ప్రయత్నాలు చేసారు. ఐనా ఉపయోగం లేకుండా పోయింది. గీతూ తన తెలివితో బేబీ బొమ్మను స్టోర్ రూంలో దాచిపెట్టింది. ఎట్టకెలకు గీతూ బేబీ బొమ్మను రేవంత్ కనిపెట్టేశాడు. గీతూ బేబీ బొమ్మను దొంగిలించి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేయడంతో నేరుగా ఆట నుంచి తప్పుకుంది. ఆమె బొమ్మను ఎవరు తీశారో తెలియక బాలాదిత్య బేబీ బొమ్మను తనదే అని తనతో వాదించే ప్రయత్నం చేసింది. కానీ హౌస్లో ఉన్నా ఇంటి సభ్యులందరు ఆ బేబీ బొమ్మ బాలాదిత్య బొమ్మ అని తేల్చారు. సింగర్ రేవంత్ కొట్టిన షాట్ కు గీతూకు పెద్ద దెబ్బే తగిలింది.

Exit mobile version