Site icon Prime9

Bigg Boss 6: నన్ను ఇండస్ట్రీలో ఒక్కరు కూడా ఫ్లర్ట్ చేయలేదంటున్న గీతూ!

geethu galata prime9news

geethu galata prime9news

Big Boss 6 : బిగ్ బాస్ ఇంట్లో గీతు ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయు. తాజాగా ఈవిడ చేసిన ఘనకార్యం ఏంటంటే అర్జున్, రేవంత్, ఆదిరెడ్డిల దగ్గర కూర్చుని, నన్ను ఇండస్ట్రీలో ఒక్కడు కూడా టచ్ చేయలేదు. కనీసం ఫ్లర్ట్ కూడా చేయలేదు అని తనకు తానే ఒక రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ వాళ్ళ ముందు చెప్పింది. అసలు ఆమెను టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంది? ఫ్లర్ట్ చేసే నోరా అది, ఒక వేళ ఫ్లర్ట్ చేద్దాం అని ఉన్నా పిచ్చిచేష్టలు చూసి పారిపోతారమ్మో అనేట్టుగా ఫేస్ పెట్టారు ఆ ముగ్గురూ. ఇండస్ట్రీలో అందరూ ‘నన్ను అంతా అక్కా’ అని పిలుస్తారు తెలుసా? అని గీతూ చెప్పింది. ఔనా, కారణం ఏంటంట అని రేవంత్ అడుగుతాడు.

‘నేను అందంగా లేనేమో’ అని నిజం గీతూ నిజం ఒప్పేసుకుంటుంది. పక్కన ఉన్న ఆదిరెడ్డి పంచ్ అయితే పెద్ద హైలైట్. కంపని తెచ్చి తెలిసి తెలిసి ఎవరు పక్కన పెట్టుకోరు అని అసలు వాస్తవం ఆదిరెడ్డి చెప్పేశాడు. నువ్వు అందంగా లేకపోవడం ఏంటి తల్లి, పొరపాటున నీతో పెట్టుకునే వాళ్ళు లక్కీ ఫెలోస్ అని రేవంత్ దిమ్మతిరిగే పంచ్ వేశాడు. అప్పుడు కూడా, నన్ను ఒక్కడంటే ఒక్కడు కూడా ఏం చేయలేరని గీతూ అంటుంది. ఐతే ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తే, ఆమెను ఎవరూ ఫ్లర్ట్ చేయలేదని తెగ ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది.

Exit mobile version