Site icon Prime9

Big Boss season 6: స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్ సొంతం చేసుకున్న బాలాదిత్య

baladitya prime9news

baladitya prime9news

Big Boss season 6: బిగ్ బాస్ హౌస్లో ఆదివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున అందరికీ ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్నా సభ్యుల్లో ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసుకున్నారనేది అనే దానిపై టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్ గా గెలిచిన స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్ బాలాదిత్య సొంతం చేసుకున్నారు.టైటిల్ గెల్చుకున్న బాలాదిత్యకు బిగ్ బాస్ ఒక గిఫ్ట్ ను ఇంటి లోపలకు పంపించాడు.

ఇది నువ్వు మాత్రమే వాడుకోవాలి. ఎవ్వరికీ ఇవ్వకూడదని ఒక చిన్న షరత పెట్టాడు. అలా చెప్పకపోతే నువ్వు ఇంకో రేలంగి మావయ్యవు అవుతావ్ అంటూ బాలాదిత్యకు ఇన్ డైరక్టుగా కౌంటర్ వేశాడు. ఎలిమినేషన్ ఉన్న వాళ్ళలో ఫైమా ఈ వారం సేఫ్ ఐనట్టు నాగ్ తెలిపాడు. ఇక ఇంటి సభ్యులతో మరో టాస్క్ను ఆడించారు. ఆ టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్న ఐటం మీద పేరు ఏమి ఉంటే దాని మీద ఉన్న ఐటం సాంగ్‌ను చెప్పాలని చెప్పాడు.

బిగ్ బాస్ ఇంటి సభ్యులును రెండు టీంలుగా విడిపోయి మొదటి ఐటంకు టీం ఏ నుంచి రేవంత్, టీం బీ నుంచి శ్రీహాన్ బజర్ కొట్టేందుకు వస్తుంటారు. కానీ శ్రీహాన్ ఒక్క దానికి కూడా జవాబు చేయలేకపోయారు. రేవంత్ అన్ని కరెక్ట్‌గా చెప్పి ఎక్కువ పాయింట్లు సంపాదించాడు. ఇంక ఇలా కాదని ఈ సారి శ్రీహాన్ బదులు ఫైమా వచ్చి బజర్ కొడుతుంది. ఫైమా బజర్ కొట్టిన ప్రయోజనం లేదు. ఆమె కూడా తప్పు చెబుతుంది. టాస్క్ మద్యలో ఆపి అదే క్రమంలో రేవంత్ సేఫ్ అయినట్టు నాగ్ బయటికి చెప్తాడు. అలాగే ఈ వారంలో ఆరోహి కూడా సేఫ్ ఐనట్టు ప్రకటిస్తాడు. మళ్ళీ టాస్క్ మొదలు పెట్టగా ఈ సారి గీతూ, సత్యలు ఇద్దరూ బజర్ కొట్టేందుకు వస్తారు. ఐతే సత్య చాలా పాటలకు జవాబు చేస్తుంది. అలా టీం ఏ సత్య టీం గెలుస్తుంది.

Exit mobile version