Site icon Prime9

MS Dhoni-Vishnu Vishal: సర్కస్‌ చూస్తున్నట్టు ఉంది – ధోనిపై హీరో విశాల్‌ సంచలన కామెంట్స్‌

Vishnu Vishal Slams MS Dhoni Batting: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై హీరో విష్ణు విశాల్‌ తీవ్ర అసహనం చూపించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్న ఆయన తీరుపై విమర్శలు గుప్పించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని టీం మెంబర్‌గా ఇంతకాలం తన ఆటను ప్రదర్శించాడు. అయితే నిన్నటి మ్యాచ్‌ మరోసారి సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహిస్తున్నాడు. ఒకప్పుడు ఐపీఎల్‌ రారాజు టీంగా ఉన్న సీఎస్‌కే ఈ సీజన్‌లో ఘోర పరాజయం చెందింది.

 

ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్‌లో ఏ ఒక్కటి గెలవలేదు. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సీఎస్‌కే తీరు మారలేదు.శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్ని సింగిల్‌ రన్‌ తిసి అవుట్‌ అయ్యాడు. ఇది ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురి చేసింది. ధోని లాంటి ఆటగాడు లోయర్‌ ఆర్డర్‌ రావడం మేంటని, టీం గెలిపించేందుకు టాప్‌ ఆర్డర్‌లో రావాల్సింది పోయి.. చివరిలో రావడమేంటని షాక్‌ అవుతున్నారు.

 

ఇంతక జట్టు గెలిపించడానికే ఆడుతున్నాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై తమిళ హీరో, గుత్తా జ్వాల భర్త విష్ణు విశాల్‌ కూడా స్పందించాడు. ఈ మేరకు అతడు ట్వీట్‌ చేస్తూ ధోని తీరుపై విమర్శలు చేశాడు. “నేను క్రికెటర్‌గా ఉండలేకపోయాను. చాలా త్వరగా ఓ నిర్ణయానికి రావాలనుకోవడం లేదు. కానీ ఇది చాలా దారుణం. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం దారుణం. ఎవరైనా గెలవకూడదని ఆడతారా?. ఇదంతా చూస్తుంటే సర్కస్‌లా ఉందనిపిస్తోంది. స్పోర్ట్స్‌ కంటే ఏ వ్యక్తి కూడా గొప్పవారు కాదు” అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే ఇందులో ఆయన ధోని పేరు ప్రస్తావించకుండానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

 

ఇది చూసి ఆయన ట్వీట్‌ ధోనినే ఉద్దేశించి చేశాడని స్పష్టం అర్థమవుతుండటంతో కొందరు నెటిజన్స్‌ ఆయన అభిప్రాయానికి మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. “కరెక్ట్‌గా చెప్పారు.. ధోని మరి 9వ స్థానంలో బ్యాటింగ్‌ రావడం ఏంటో.. టీం గెలిపించాలనుకుంటున్నాడా? లేదా?. ఆయన హుందాగా రిటైర్‌మెంట్‌ తీసుకోవడం బెటర్‌” అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎవరైనా గెలవడానికే ప్రయత్నిస్తారు. టీమ్‌ ఓడిపోవాలని ఏ ఆటగాడు కోరుకురు అంటూ ధోని సపోర్టుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar