Site icon Prime9

Junior Balayya : కోలీవుడ్ లో తీవ్ర విషాదం… ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి

tamil actor junior balayya passes away due to health issues

tamil actor junior balayya passes away due to health issues

Junior Balayya : చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు వరుసగా ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. వారి మరణ వార్తను సినీ నటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వరుస మరణాలు మరువక ముందే తమిళ ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ నటుడు, సీనియర్ యాక్టర్ టీఎస్ బాలయ్య కొడుకు జూనియర్ బాలయ్య మరణించారు.

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న టీఎస్ బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ బాలయ్య. నటుడిగా జూనియర్ బాలయ్య మొదటి సినిమా మొదలైన మూడు రోజులకే తండ్రి టీఎస్ బాలయ్య మరణించడం బాధాకరం అని చెప్పాలి. అయితే జూనియర్ బాలయ్య తన తండ్రి స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇటీవలే పులి, నెర్కొండ పార్వై లాంటి సినిమాల్లో నటించారు.

కాగా ఈరోజు చెన్నైలో తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసున్న జూనియర్ బాలయ్య శ్వాస సంబంధింత సమస్యతో మృతి చెందారు. జూనియర్ బాలయ్యకు నివాలి అర్పిస్తూ పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Exit mobile version