Site icon Prime9

Odela 2 Release Date: ఓదెల 2 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – అనుష్కను వెనక్కి నెట్టి ముందుగా వస్తున్న తమన్నా

Tamannaah Bhatia Odela 2 Release Date Announced: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. లాక్‌డౌన్‌లో ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఫస్ట్‌ పార్ట్‌కి దర్శకత్వం వహించిన డైరెక్టర్‌ అశోక్‌ తేజయే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ అందించారు. ఆయన దర్శకత్వం పర్యవేక్షణలోనే అశోక్‌ తేజ ‘ఓదెల 2’ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా నాగసాధు పాత్రలో కనిపిస్తుండటంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళ వేదికగా ఓదెల 2 టీజర్‌ విడుదల చేయగా.. దానికి ఆడియన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ షూరు చేసింది. ఈ నేపథ్యంలో మూవీ టీం ‘ఓదెల 2’ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. ఏప్రిల్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో ఓదెల 2 విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్‌ చేసిన తమన్నా పోస్ట్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది.

కాగా అనుష్క ఘాటీ మూవీ ఏప్రిల్‌ 18న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని వాయిదా పడిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఓదెల 2ని ఏప్రీల్‌ 17న తీసుకువస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీం వర్క్‌ సంస్థలపై డి మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓదెల రైల్వే స్టేషన్‌లో ప్రధాన పాత్రలైన హెబ్బా పటేల్‌, వశిష్ఠలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంపత్ నంది కథ అందించడంతో ఈ సినిమా పాన్‌ స్థాయికి వెళ్లింది. ఇక ఇందులో తమన్నాతో పాటు హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ, యువ, నాగ మహేష్‌, వంశీ, గగన్‌ విహారి, సురేందర్‌ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar