Vijayakanth: చక్రాల కుర్చీకే పరిమితమైన కెప్టెన్ విజయకాంత్.. ఎందుకంటే..?

కెప్టెన్ విజయ‌కాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 90ల్లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదమయ్యాయి.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 06:12 PM IST

Vijayakanth: కెప్టెన్ విజయ‌కాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 90ల్లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదమయ్యాయి.

ముఖ్యంగా ‘కెప్టెన్ ప్రభాకర్’ సినిమా తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది.

రజినీకాంత్, కమల్ హాసన్ చిత్రాలతో పాటు విజయకాంత్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడేవారు.

కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. పవర్ ఫుల్ పోలీసుల పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్.

కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

పొలిటికల్ కెరీర్..

అయితే 2005లో ఆయన డిఎండికే పేరుతో పొలిటికల్ పార్టీ ప్రకటించారు.

ఆ నెక్స్ట్ ఇయర్ 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేశారు.

అయితే వ్రిధాచలం నియోజకవర్గం నుండి తాను ఒక్కడే గెలిచారు.

2011 ఎన్నికల్లో సైతం ఆయన రిషివందియం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. మూడోసారి ఆయన ఓడిపోయారు.

2010లో చాలా గ్యాప్ తర్వాత విజయకాంత్ హీరోగా మూవీ చేశారు. విరుధగిరి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన దర్శకుడు కూడాను.

చివరిగా 2015లో ఓ మూవీలో ఆయన క్యామియో రోల్ చేశారు. కొన్నాళ్లుగా విజయకాంత్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

డయాబెటిస్ తో వీల్ ఛైర్ కే పరిమితం..

ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకటి రెండు సార్లు విషమ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు.

ఇటీవల ఆయన కాలి వేళ్లలో మూడింటిని తొలగించారు. దీంతో విజయకాంత్ నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆయన చక్రాల కుర్చీకే పరిమితమైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, జనవరి 31న విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత తమ 33వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

అనారోగ్యంతో బక్కపలచగా అయిపోయిన విజయకాంత్.. కుర్చీలో కూర్చొనే భార్య మెడలో పూలమాల వేశారు.

విజయకాంత్ మొహానికి మాస్క్, కళ్లజోడు పెట్టుకోవడంతో ఆయన్ని గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది.

తమ ఇద్దరు కుమారులు షణ్ముగ పాండియన్, విజయ ప్రభాకరన్ సమక్షంలో విజయకాంత్, ప్రేమలత వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

తనకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తన ఫ్యామిలీ ఫొటోను విజయ‌కాంత్ ట్విట్ చేశారు.

విజయకాంత్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ దర్శకుడు, దళపతి విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ స్వయంగా ఇంటికి వెళ్లి కెప్టెన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

విజయకాంత్‌తో కాసేపు గడిపారు. 1981లో ‘సట్టమ్ ఒరు ఇరుట్టారై’ సినిమాతో విజయకాంత్‌కు ఎస్.ఎ.చంద్రశేఖర్ బిగ్ బ్రేక్ ఇచ్చారు.

ఆ తరవాత విజయకాంత్ వెనుదిరిగి చూసుకోలేదు. 150కు పైగా సినిమాల్లో విజయకాంత్ నటించారు.

దర్శకుడిగా చంద్రశేఖర్ విజయకాంత్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగా పరిచయమైంది విజయకాంత్ చిత్రంతోనే.

ఈ క్రమంలో ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన్ని కలిసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం విజయకాంత్‌ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆయన అలా సన్నగా మారడాన్ని చూసి విజయ్ కాంత్ అభిమానులంతా బాధ పడుతున్నారు.

మళ్ళీ మామూలుగా ఆరోగ్యంగా మారాలని కోరుకుంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/