Site icon Prime9

Gandhi Tatha Chettu OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన సుకుమార్‌ కూతురు మూవీ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Gandhi Tatha Chettu Now Streaming on OTT: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుకృతి వేణి స్టూడెంట్‌గా నటించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్టులను గెలుచుకోవడంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం కోసం ముందుకు వచ్చి ప్రచారం చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సైతం గాంధీ తాత చెట్టుపై ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమంటూ ప్రశంసలు కురిపించాడు.

ముఖ్యంగా సుకృతి వేణి యాక్టింగ్‌ని కొనియాడాడు. దీంతో రిలీజ్‌కు ముందు మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. సినిమా రిలీజ్‌ తర్వాత మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. థియేటర్‌లో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో దర్శనం ఇచ్చింది. ఎలాంటి ప్రకటన, హడావుడి లేకుండానే ఈ మూవీ ఓటీటీకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలో ఈ సినిమా విడుదలైంది. దాదాపు రెండు నెలల తర్వాత గాంధీ తాత చెట్టు ఓటీటీ రావడం విశేషం.

Gandhi Tatha Chettu Trailer | Sukriti Veni Bandreddi | Padmavathi Malladi | Thabitha Sukumar

ఈ సినిమా కథ విషయానికి వస్తే

ఇది తాత-మనవరాలు మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గా చూపించారు. నిజామాబాద్‌ జిల్లా అడ్లూర్‌లో రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తుంటారు. ఆయన గాంధీ ఫాలోవర్‌. ఆ మహాత్మ గాంధీ గుర్తుగా తన పోలంలో ఓ చెట్టు నాటుతాడు. ఎప్పుడూ ఆ చెట్టు చెంతనే గడుపుతూ అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతలను నమ్మి అనుసరించే ఆయన తన మనవరాలికి గాంధీ అని పేరు పెట్టుకుంటాడు. పేరు మాత్రమే కాదు సిద్ధాంతాలను బోధిస్తూ పెంచుతాడు. అయితే అనుకోకుండ రామచంద్రయ్య తన ఊరిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు తన తాత కోసం, ఆయన నమ్మిన గాంధీ సిద్ధాంతలను కాపాడేందుకు ఆయన మనవరాలు గాంధీ ఏం చేసిందనేది ఈ మూవీ కథ.

Exit mobile version
Skip to toolbar