Site icon Prime9

Sreeja Konidala : మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. ‘నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కలిశా..’ ఎవరంటే?

sreeja-konidala-emotional-post-on-instagram-goes-viral

sreeja-konidala-emotional-post-on-instagram-goes-viral

Sreeja Konidala : మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ… ఆ తర్వాత కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ దేవ్ తో ఆమె విడిపోతుందనే రూమర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తగ్గట్టే ఈ మధ్య కాలంలో శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు జంటగా కనిపించడం లేదు. అదే విధంగా శ్రీజ కూతురు పుట్టిన రోజును కూడా ఆమె ఒక్కరే ఉండడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీజ పెట్టిన రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు ఆ వీడియోలో… “కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా” రాసుకొచ్చింది. ‘డియర్‌ 2022 నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కష్ట సుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకునే, ఎక్కువగా ప్రేమించే, అన్ని విధాలుగా కాపాడే, నాకు మద్దతుగా నిలబడేవాడు వారు నన్ను కలవడం అద్భుతం. ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది అని శ్రీజ రాసుకొచ్చింది”.

అదే విధంగా సెల్ఫ్‌ లవ్‌ అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది. దీంతో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ దూరం అయ్యిందని అందుకే సెల్ఫ్ లవ్ అంటూ పోస్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ శ్రీజ కోసం జీవిత భాగస్వామిని వెతకాలని కొందరు అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న శ్రీజ … ఆ తర్వాత అతని నుంచి విడిపోయింది. అప్పట్లో ఆ విషయం ఎంత రాద్దాంతం అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక కొన్ని సంవత్సరాల క్రితమే కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండో వివాహం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజ విడిపోతుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Exit mobile version