Site icon Prime9

Ram Charan : జీ 20 సదస్సులో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్.. స్పెషల్ స్టోరీ !

special story on ram charan in g20 summit participation and interview

special story on ram charan in g20 summit participation and interview

Ram Charan : జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జీ 20 సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు G20 సదస్సుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇక మన దేశం తరుపు నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలుగు ప్రజలకు మరింత గర్వ కారణంగా నిలుస్తుంది. అదే విధంగా రామ్ చరణ్ ఈ మూడు రోజులు పాటు శ్రీనగర్ లోనే ఉండడనున్నాడు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.

ఈ సదస్సులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. కశ్మీర్, శ్రీనగర్ తో ఉన్న అనుబంధాన్ని తెలియజేశాడు. కాశ్మీర్ ఒక స్వర్గం లాంటి ప్రదేశం. 1986 నుంచి నా సమ్మర్ వెకేషన్స్ అని.. మా నాన్నతో సినిమాలు అని ఇక్కడికి వస్తూనే ఉన్నాను. మా నాన్న కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఆయన సినిమాలు ఎన్నో ఇక్కడ గుల్మార్గ్, సోనామర్గ్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అలానే ఈ ఆడిటోరియంలో నేను 2016లో షూటింగ్ జరుపుకున్నాను. నా మూవీ ధృవ కోసం ఇక్కడ 95 డేస్ వర్క్ చేశాం. ఆ సినిమా ద్వారా మా ఆడియన్స్ కి కాశ్మీర్ ని మేము కొంత చూపించగలిగాం అంటూ తెలిపారు. అనంతరం స్టేజి పై సమ్మిట్ లో పాల్గొన్న కొరియన్ అంబాసడర్స్ తో కలిసి చరణ్.. నాటు నాటు పాటకి స్టెప్పులు వేశాడు. అందుకు సంబంధించిన వీడియోని.. ఎంబసీ ప్రతినిధులు తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.

 

ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. “మా నాన్న గారికి 68 వయసు. అయినా ఆయన నాలుగు సినిమాలు చేస్తూ ఇంకా బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకునే యాక్టర్స్ లో ఆయన ఒకరు. ఇక ఇంతటి ఫేమ్ సంపాదించుకున్నా.. ఇప్పటికి ఇంకా ఉదయం 5:30 గంటలకు నిద్ర లేచి వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటారు. 68 ఏళ్ళ వయసులో కూడా ఆయన సినిమా పై, చేసే పని పై చూపించే డెడికేషన్ చూసి మాకు ఎంతో స్ఫూర్తిని కలగజేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సదస్సులో మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. “రామ్ చరణ్ కూడా ఇక్కడికి వచ్చాడు. అతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంటా. ఇక్కడికి ప్రజలు వచ్చింది కూడా మమల్ని చూడడానికి కాదు. రామ్ చరణ్ చూడడానికే వచ్చారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

 

Exit mobile version