SobhitaDhulipala: మాజీ మిస్ ఇండియా అయిప శోభిత ధూళిపాళ.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌కే పరిమితమవుతున్న ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ నటించిన ‘గూఢచారి, మేజర్’ చిత్రాల్లో నటించింది. ఇక అక్కినేని హీరో నాగ చైతన్యతో డేటింగ్ చేస్తోందంటూ కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ హాట్ బ్యూటీ.. రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 2’ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాలో చాలామంది స్టార్స్ హీరో హీరోయిన్స్ నటించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. పొన్నియన్ సెల్వన్ 2 లో యువరాణి వానతిగా నటించింది శోభిత. ఈ సినిమాలో నటించడం అతి పెద్ద మొమరీగా మిగిలిపోతుందని చెప్పంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న శోభిత తన అందంతో ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా అమ్మడు హాట్ పిక్స్‌ను ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.