Sobhita Dhulipala Special poster about Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకొచ్చింది. తాజాగా, సినిమా విడుదలైన సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక పోస్ట్ చేశారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అని సరదాగా రాసుకొచ్చిన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగ చైతన్య ఇటీవల శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. కాగా, ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్టర్ షేర్ చేసింది. ‘ఈ మూవీ మేకింగ్ చేస్తున్న సమయంలో చాలా ఫోకస్, పాజిటివ్ గా మీరు ఉండడాన్ని దగ్గరుండి చూశాను. అయితే అలాంటి ఓ గొప్ప ప్రేమకథ సినిమాను అందరితో పాటు నేనున ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఫైనల్‌గా గడ్డం షేవ్ చేస్తావు.. తొలిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ పోస్టర్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు నాగ చైతన్య స్పందించారు. ‘ థ్యాంక్యూ బుజ్జితల్లి’ అంటూ రీ పోస్ట్ చేశారు.