Site icon Prime9

Sivakarthikeyan: ఇద్దరు హీరోల సినిమాలకు ఒకే టైటిల్‌ – అలా ఎలా పెడతారు?

Parasakthi A clash of title: ఇద్దరు స్టార్‌ హీరోలు సినిమాలకు ఒకే టైటిల్‌ పెట్టారు. అది కూడా ఒకే రోజు గంట వ్యవధిలో ప్రకటించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తమిళ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది అమరన్‌ చిత్రంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని జరుపుకుంటుంది. శివ కేర్తికేయన్‌ 25వ చిత్రంగా రూపొందుతుంది. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. దీనికి ‘పరాశక్తి’ అనే టైటిల్‌ని ఖరారు చేసింది మూవీ టీం.  ఈ మేరకు టైటిల్ టీజర్‌ని విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మరోవైపు విజయ్‌ ఆంటోని నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ని కూడా ఇదే రోజు ప్రకటించారు.

PARASAKTHI -Title Teaser (Telugu) Sivakarthikeyan | Sudha Kongara | Ravi Mohan| GV Prakash| Atharvaa

శివ కార్తికేయన్‌ మూవీ టైటిల్‌ ప్రకటనకు గంట ముందు విజయ్‌ ఆంటోని మూవీ టైటిల్‌ని రివీల్ చేశారు. తమిళంలో ‘శక్తి తిరుమగణ్’ అని ప్రకటించారు. ఇక ఇతర భాషల్లో పరాశక్తి అని పేరు ఫిక్స్‌ చేశారు. విజయ్‌ ఆంటోనికి కూడా ఇది 25వ చిత్రం కావడం గమనార్హం. దీంతో ఇప్పుడిది కోలీవుడ్‌ తీవ్ర చర్చకు దారి తీసింది. అనుకోకుండా జరిగిందా లేక కావాలనే పోటీగా ఈ పేర్లు పెట్టుకున్నారా అనేది సోచనీయంగా మారింది. ఈ టైటిల్స్‌తో మాత్రం వారి ఫ్యాన్స్‌ డైలామాలో పడ్డారు. ఇద్దరు హీరోల సినిమాలకు ఒకే పేరుతో టైటిల్స్‌ ఎలా పెడతారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఏమైనా వివాదంగా మారుతుందా? లేక ఇవే పేర్లు కంటిన్యూ చేస్తారా చూడాలి.

Exit mobile version
Skip to toolbar