Shiva Shakti Dutta : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. చిన్నా పెద్దా.. సామాన్యులు.. సెలబ్రెటీలు అనే తేడా లేకుండా చాలామంది ఈ సాంగ్‌కు కాళ్లు కదిపారు. నాటు నాటు సాంగ్‌కు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని వరించింది. ఓ రేంజ్ లో అందర్నీ ఆకట్టుకున్న నాటు నాటు పాట మాత్రం కీరవాణి తండ్రికి నచ్చలేదట.
కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి అందరికీ తెలిసిందే. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన ఆయన ఎన్నో పెయింటింగ్స్ వేశారు. శివ శక్తి సోదరుడు విజయేంద్ర ప్రసాద్. అలాగే విజయేంద్ర ప్రసాద్ అబ్బాయి రాజమౌళి. నాటు నాటు పాటలో అసలు సంగీతమెక్కడ ఉంది అంటూ తాజాగా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నాటు నాటు’పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కీరవాణి నా పంచ ప్రాణాలు. మూడవ ఏటనే అతనికి సంగీతం నేర్పించాను. నేనే ఆయనకు ఆదిగురువు. నేను రాసే పాటలకు ట్యూన్ చేస్తూ సంగీతం నేర్చుకున్నారు. కీరవాణి తన నైపుణ్యంతో ఎప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్ మాత్ర పెద్దగా నాకు నచ్చలేదు.
అసలు అది పాటేనా? అందులో సంగీతం అంటూ ఉందా? కీరవాణి ఇచ్చిన సంగీతంతో పొల్చితే ఇదొక మ్యూజికేనా అని ప్రశ్నించారు. విధి అలా జరగాలని ఉంది. చంద్రబోస్ రాసిన ఐదు వేల పాటల్లో ఇదొక పాటనా? అంటూ షాకింగ్ గా స్పందించారు. అయితే ‘నాటు నాటు’లో మాత్రం ఆయనకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా నచ్చిందని తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ బాగా డాన్స్ చేశారని ప్రశంసించారు. రాజమౌళి కాన్సెప్ట్ అదుర్స్.. చంద్రబోస్, కీరవాణి కృషికి నాటు నాటు పాట రూపంలో ఫలితం దక్కిందని చెప్పుకొచ్చాడు.
శివశక్తి దత్తా గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘సై, ఛత్రపతి, బాహుబలి’ వంటి సినిమాలకు తన పాటలను అందించారు. నల్లా నల్లాని కళ్ల పిల్ల (సై సినిమా).. ధీవరా.. మమతల తల్లీ (బాహుబలి),.. ఇలా చాలా పాటల్నీ రాశారు. RRR చిత్రానికి కూడా ఒక పాట రాశారు శివశక్తి దత్తా. ‘రామం రాఘవం’ అనే పాటను రాసింది ఆయనే. అయితే ఈ లిరిక్స్‌కు కీరవాణీ అందించిన ట్యూన్ అసలు బాగాలేదని.. తనకు నచ్చలేదని అన్నారు శివశక్తి దత్తా.. తాను ఎంతో అద్భుతంగా ఆ పాటను రాస్తే.. కీరవాణీ, రాజమౌళి కలిసి ఆ లిరిక్‌ను పాడు చేశారని.. ఆ పాట విషయంలోనే తాను సంతోషంగా లేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు అయినా కూడా తిరుమల నాయక అనే సినిమాను డైరెక్షన్ చేస్తూ ఆయన చిరకాల కోరికను నెరవేర్చుకుంటున్నారు. శివశక్తి దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.