Site icon Prime9

Sharwanand: స్టార్ట్ అయిన హీరో శర్వానంద్ పెళ్లి సందడి.. హల్దీ వీడియోలు వైరల్

Sharwanand

Sharwanand

Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్‌ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్‌, జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా జూన్‌ 2, 3 తేదీల్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ సెర్మనీ నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య ఈ వేడుక సందడి సాగింది. శర్వా హల్దీ సెర్మనీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

వైరల్ గా హల్దీ వీడియోలు(Sharwanand)

శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి. ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. టీడీపీ మాజీ మంత్ర బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి రక్షితా రెడ్డి మనువమరాలు అవుతుంది. రక్షితా రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుందని సమాచారం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా శర్వానంద్ కు రక్షితా రెడ్డి పరిచయం అయినట్టు తెలుస్తోంది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

త్వరలోనే షూటింగ్ లకు

మరో వైపు శర్వానంద్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. అతను చివరగా ‘ఒకే ఒక జీవితం’చిత్రంలో నటించాడు. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్యతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడ శర్వా. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే శర్వా కొంత విరామం తీసుకున్నారని.. త్వరలోనే షూట్‌లోకి అడుగుపెడతారని సమాచారం.

 

 

Exit mobile version