Shahrukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతి యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ అంజలి బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో నలుగురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ తో ఆమెను ఢీ కొట్టారు. ఆమె కాలు కారు చక్రంలో చిక్కుకోగా, 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకు వెళ్లడంతో ఆమె మరణించింది. న్యూ ఇయర్ రోజు జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది.
అయితే తండ్రి లేకపోయిన ఆ కుటుంబానికి అన్నీ తానై పోషిస్తున్న అంజలి మరణంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంఘటన షారుఖ్ ఖాన్ మనసుని కూడా ఎంతో కలచివేసింది. దీంతో అంజలి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తన మీర్ ఫౌండేషన్ ద్వారా అంజలి తల్లికి డబ్బుని అందజేయబోతున్నట్లు షారూఖ్ ప్రకటించాడు. అయితే ఎంత ఆర్ధిక సాయం చేస్తున్నాడు అనేది గోప్యంగా ఉంచారు.
ఇక ఈ విషయం తెలిసిన షారూఖ్ అభిమానులు తమ హీరో రియల్ బాద్‌షా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ‘పఠాన్’ సినిమా కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. కాగా సినిమా ఈ నెల 25న షారుఖ్ నటించిన పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఇవి కూడా చదవండి…
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
Director Bobby : మెగాస్టార్ చిరంజీవి తండ్రికి.. “వాల్తేరు వీరయ్య” టైటిల్ కి లింక్ ఉందంటున్న డైరెక్టర్ బాబీ
Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోషిత్ శెట్టికి ప్రమాదం.. కామినేనిలో సర్జరీ
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/