Site icon Prime9

Pushpalatha: ఇండస్ట్రీలో విషాదం – ప్రముఖ నటి పుష్పలత కన్నుమూత

Senior Actress Died: ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటి పుష్పలత (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పుష్పలత ‘కొంగు నాడు తంగం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. ఇక తెలుగులో ‘రాము’ సినిమాతో ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుస సినిమా అవాకశాలను అందుకుననారు. ‘యుగపురుషుడు’ , ‘వేటగాడు’ వంటి చిత్రాల్లో మదర్‌ రోల్స్‌ చేశారు.

శారద, బార్ మగలే బార్, నౌమోన్ ఒరు పెన్, యరుక్కు సొండం, తాయే ఉనక్క వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఆమె తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి దక్షిణాదిలో స్టార్‌గా గుర్తింపు పొందారు. అప్పటి స్టార్ హీరోలందరి సినిమాలలో నటించిన పుష్పలత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నాన్ అడుంబు అయిలి’ చిత్రంలో రజనీకాంత్ అత్తగా ప్రతినాయక పాత్రను పోషించారు.

Exit mobile version
Skip to toolbar