Site icon Prime9

Sankranthiki Vasthunam Collections: రికార్డు కలెక్షన్స్‌తో దూసుకపోతున్న సంక్రాంతికి వస్తున్నాం – మూడు రోజుల్లోనే 100 కోట్లు చేసిన వెంకీ మామ

Sankranthiki Vasthunam Box Office Collections: వెంకటేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి పండుగ సందర్భంగా థియేటర్లో వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పర్ఫెక్ట్‌ పండగ మూవీ అనిపించుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తుంది. తొలిరోజు ఊహించని రేంజ్‌ భారీ ఓపెనింగ్స్‌ ఇచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమానే. ‘దీంతో సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపుతుంది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఫస్ట్‌ డే రూ. 45 కోట్ల గ్రాస్‌ చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 32 కోట్ల వసూళ్లు చేసింది. దీంతో రెండు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం రూ. 77 కోట్ల గ్రాస్‌ చేసి వంద కోట్లకు చేరువైంది. ఇక మూడో రోజు రూ. 29 కోట్లు కలెక్షన్స్‌తో వందకోట్ల క్లబ్‌ చేరింది ఈ సినిమా. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు ఆడియన్స్‌.

ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో ఈ సినిమా దూసుకుపోతుంది. అక్కడ మిలియన్‌ డార్లకు పైగా వసూళ్లు చేసింది రికార్డు క్రియేట్‌ చేసింది. దీంతో అనిల్‌ రావిపూడి కెరీర్‌లో వరుసగా మిలియన్‌ డాలర్లు రాబట్టిన ఐదవ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ అనిల్‌ రావిపూడి ఆనందం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ సంక్రాంతికి బ్లాక్‌ బస్టర్‌ పొంగల్‌ అనిపించుకుంది అనిల్‌ రావిపూడి, వెంకిమామ కాంబో. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు.

ఎఫ్‌ 2, ఎఫ్‌ 2లు సూపర్‌ హిట్‌ మాత్రమే కాదు వరసగా రూ. 100 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో వీరిది హ్యాట్రిక్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్ కాంబో అనిపించుకుంది. ఇక బుక్‌మై షోలోనూ సంక్రాంతికి వస్తున్నాం టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మూడు రోజుల్లో 1.5 మిలియన్ల టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు బుక్‌ మై షో తెలిపింది. ఇక సినిమాకి మంచి రెస్పాన్స్‌ వస్తుండటం, సంక్రాంతి పండుగతో పాటు వీకెండ్‌ కూడా రావడంతో ఏపీ, తెలంగాణలో అదనంగా 220 ప్లస్‌ షోలను  ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version