Site icon Prime9

Sandeep Reddy Vanga: అర్జున్‌ రెడ్డి సినిమాకు ఫస్ట్‌ సాయి పల్లవినే హీరోయిన్‌ అనుకున్నా, కానీ!

Sai Pallavi is 1st Choice For Arjun Reddy: ‘అర్జున్‌ రెడ్డి మూవీలో మొదట హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నా’ అని అసలు విషయం బయటపెట్టాడు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించి తండేల్‌ మూవీ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తండేల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పై మాట్లాడుతూ సాయి పల్లవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాన చిత్రం అర్జున్‌ రెడ్డి మూవీకి మొదట సాయి పల్లవిని హీరోయిన్‌గా అనుకున్నానని చెప్పాడు. “అర్జున్‌ రెడ్డి సినిమా అంతా ఒకే అయ్యాక హీరోయిన్‌గా సాయి పల్లవి నా ఫస్ట్‌ చాయిస్‌. హీరోయిన్‌ కోసం మలయాళ అమ్మాయి కోసం వెతుకుతుంటే కేరళ కో-ఆర్డినేటర్‌ నెంబర్‌ దొరికింది. అతనికి ఫోన్‌ మూవీ స్టోరీ చెప్పాను. ప్రేమలో విఫలమై పతమైన ఓ యువకుడి ప్రేమకథతో రొమాంటిక్‌ మూవీ చేస్తున్నామని చెప్పా. సాయి పల్లవిని హీరోయిన్‌గా అనుకుంటున్నామని చెప్పాను. రొమాన్స్‌ అంటే ఎలా ఉంటుందని అనిగాడు. తెలుగులో ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నింటి కంటే అంతకుమించి ఉంటుందని చెప్పాను. అయితే సాయి పల్లవి గురించి ఆలోచించకండి, తను కనీసం స్లీవ్‌లెస్‌ కూడా వేసుకోదని చెప్పాడు” అని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత ప్రారంభంలో హీరోయిన్లు ఎంత పద్దతిగా ఉన్న ఆ తర్వాత అవకాశాలు వచ్చే కొద్ది మారిపోతుంటారు. అలా చాలామందిని చూశాం. సాయి పల్లవి మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. 10 ఏళ్లుగా తనని చూస్తున్నా తనలో ఎలాంటి మార్పు రాలేదు” అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక సందీప్‌ రెడ్డి వంగా కామెంట్స్‌కి సాయి పల్లవి స్పందింది. “అర్జున్‌ రెడ్డి సినిమా తన వరకు వస్తే చేసేదాన్నో, కాదో తెలియదు. కానీ, ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఎవరికి ఏ మూవీ రావాలో అదే వస్తుంది. మూవీ షాలిని చాలా బాగా నటించింది. విజయ్‌ బాగా చేశారు. అది వాళ్లిద్దరూ చేయాల్సిన మూవీ” అని పేర్కొంది. కాగా అర్జున్‌ రెడ్డి మూవీ ఎంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యిందో తెలిసిందే. మితిమిరన రొమాన్స్‌ కారణంగా ఈ సినిమా కొందరి నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ యూత్‌ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ మరింత పెరిగింది.

Exit mobile version