Site icon Prime9

Saima Awards: సైమా అవార్డులు.. 12 నామినేషన్లతో ’పుష్ప‘ జోరు

siima awards 2022 pushpa movie

Saima Awards: అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ గా ఎన్నిరికార్డులు సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం ఇపుడు దక్షిణ భారత ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( సైమా ) 10వ ఎడిషన్ తెలుగు విభాగంలో నామినేషన్ల జాబితాలో ముందుంది. ఈ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 10-11 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ‘పుష్ప’ 12 కేటగిరీల్లో నామినేట్ కాగా, బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ 10 కేటగిరీల్లో నామినేట్ అయింది. అనుదీప్ కెవి ‘జాతి రత్నాలు’ మరియు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ చెరో ఎనిమిది నామినేషన్లతో ఉన్నాయి.

తమిళ విభాగంలో, ధనుష్ ప్రధాన పాత్రలో విమర్శకుల ప్రశంసలు పొందిన బ్లాక్ బస్టర్ ‘కర్ణన్’ 10 నామినేషన్లతో ముందుంది. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాక్టర్’ తొమ్మిది నామినేషన్లు పొందగా, లోకేశ్ కనకరాజ్ ‘మాస్టర్’ మ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత బయోపిక్‌ తలైవికి ఏడు నామినేషన్లు వచ్చాయి. మలయాళ విభాగంలో టోవినో థామస్ నటించిన ‘మిన్నల్ మురళి’ అత్యధిక నామినేషన్లను పొందింది. ఇది 10 విభాగాల్లో నామినేట్ కాగా, దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎనిమిది కేటగిరీల్లో నామినేట్ అయింది. ఫహద్ ఫాసిల్ యొక్క ‘మాలిక్’ మరియు ‘జోజీ’ ఒక్కొక్కటి ఆరు నామినేషన్లను కలిగి ఉన్నాయి.

కన్నడలో 10 నామినేషన్లతో ‘రాబర్ట్’ అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిది నామినేషన్లతో ‘గరుడ గమన వృషభ వాహన’ మరియు ఏడు నామినేషన్లతో నటుడు పునీత్ రాజ్‌కుమార్ ‘యువరత్న’ కన్నడలోసైమా నామినేషన్లలో ముందున్నాయి.

Exit mobile version
Skip to toolbar