Site icon Prime9

Virupaksha Movie : సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” ఓటీటీ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

sai dharam tej virupaksha movie ott release fixed

sai dharam tej virupaksha movie ott release fixed

Virupaksha Movie : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి అటు ఆడియెన్స్ నుంచి.. ఇటు సినీ విశ్లేషకులు, ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించటం బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించగా.. కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో సునీల్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. ముందుగు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. తెలుగు మినహా ఇతర భాషల్లో అయితే అయితే ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

కాగా ఈ సినిమా విడుదలకి ముందు రూ.25 కోట్ల బిజినెస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ నటన, అలాగే చివరి 20 నిముషాలు సంయుక్త మీనన్ నటన ప్రతిభతో సినిమా ప్రేక్షకులను కట్టి పడేసింది అని అందువల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక థియేటర్ లో అందర్నీ భయపెట్టిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం చూసింది. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సాయి ధరమ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాంతో థియేటర్ లో చూద్దామని కుదరక మిగలిన వాళ్ళంతా ఓటిటి రిలిజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నెట్ ఫ్లిక్స్ ఒక పోస్ట్ చేసింది. అందులో మే 21 నుంచి విరూపాక్ష మూవీ ప్రసారం కానుంది. థియేటర్ లో బయపడి కొన్ని సీన్స్ సరిగా చూసి ఉండరు. ఆ సీన్స్ ఇప్పుడు ఇంటిలో ధైర్యంగా చూసేయండి అంటూ రాసుకొచ్చారు. అదే విధంగా సాయి ధరమ్ తమిళ్ మూవీ వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి చేసేశారు. PKSDT అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి ‘BRO’ అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఫిక్స్ చేశారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version