Prime9

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ప్రారంభం

Tollywood News: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ముహూర్తం సన్నివేశానికి సాయి ధరమ్ తేజ్ క్లాప్ నివ్వగా బాపినీడు భోగవల్లి కెమెరా స్విచాన్ చేశారు.

ఈ వేడుకకు డైరెక్టర్ బుచ్చిబాబు సన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌తో మా నిర్మాణ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం మా ప్రొడక్షన్ బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే చిత్ర నిర్మాణం ప్రారంభం అవుతుందని అన్నారు. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సమాచారాన్ని త్వరలో అందజేస్తామని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar