Site icon Prime9

Pushpa 2 Review: ‘పుష్ప2’ రివ్యూ.. బన్నీ మాస్ జాతర.. ఎలా ఉందంటే?

Pushpa 2 movie Review in telugu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌‌‌‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా.. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప-ది రూల్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 సినిమా ఫలించిందా? అలాగే ప్రేక్షకులను ఎలా అలరించిందో తెలుసుకుందాం.

కథ:
పుష్ప-1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడన్నదే కథ. తొలుత ఓ కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అలియాస్ పుష్పరాజ్.. మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చాడు. ఈ సమయంలో తనకు ఎవరు అడ్డొచ్చినా తగ్గేదేలే.. అంటూ పోటీపడుతూ అందరికీ అందని ఎత్తుకు ఎదుగుతాడు. ఆ తర్వాత తన పేరు ఓ బ్రాండ్ అనేలా నేషనల్ టూ ఇంటర్నేషనల్ వరకు తిరుగులేని లీడర్‌గా ఎదుగుతాడు. అయితే పుష్పరాజ్‌కు ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ ఎదురుపడతాడు. పుష్పరాజ్ చేసేటువంటి ఎర్రచందనం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోతాడు. దీంతో ఇద్దరి మధ్య ఎదురుపడిన పరిస్థితులు ఘర్షణకు దారి తీస్తాయి. ఇదిలా ఉండగా.. పుష్పరాజ్ సతీమణి శ్రీవల్లి అంటే పుష్పకు విపరీతమైన ప్రేమ. అయితే శ్రీవల్లికి మాత్రం తన భర్త పుష్పరాజ్.. సీఎంతో ఫోటో దిగాలని అనుకునేది. తన భార్య కోరిక మేరకు సీఎం వద్దకు వెళ్లగా.. ఎదురుపడిన పరిస్థితులు ఏంటి? ఎమ్మెల్యే సిద్దప్పనాయుడు ఎందుకు సాయం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డితో గొడవ ఎందుకు జరిగింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:
పుష్ప 1 తో పోలిస్తే.. పుష్ప 2లో మాస్ జాతర కనిపించింది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తనకంటూ సొంతంగా ఓ పెద్ద వ్యవస్థనే సృష్టిస్తాడు. పార్ట్ 1 లో కనిపించిన అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ ఇందులోనూ కనిపించింది. అదే ఇమేజ్‌ను బలంగా నమ్మకున్న డైరెక్టర్ ఎక్కువగా హీరోయిజంపై దృష్టి సారించాడు. ఇందులో తన సైకలాజికల్ గేమ్ ఆడి ఆకట్టుకున్నాడు. ప్రధానంగా పుష్ప‌రాజ్ స్ట్ర‌గుల్స్‌, ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇంకా చెప్పాలంటే జాతర సీన్ హైలెట్‌గా నిలిచింది. దీంతో ప్రేక్షకుడు ఎక్కడికి కదలకుండా అలాగే చూసిండి పోయేలా చేయడం డైరెక్టర్ గొప్పతనం అనుకోవచ్చు. తొలుత కొన్ని సీన్స్ సంబంధం లేనట్టుగా అనిపించాయి. తర్వాత కొంత సాగదీతగా అనిపించినా.. ఎక్కడా బోర్ కొట్టలేదు. అల్లు అర్జున్ నటవిశ్వరూపం ఫ్యాన్స్‌కు కిక్కు ఇచ్చింది. అయితే ఎక్కువగా సెంటిమెంట్, యాక్షన్ లింక్ చేయడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందినట్లు అవుతుంది.

Exit mobile version