Site icon Prime9

Renu Desai on 2nd Marriage: అప్పుడే నేను రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎవరికి భయపడను!

renu desai comments on marriage

renu desai comments on marriage

Renu Desai Sensational Comments on Second Marriage: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రేణు.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తో ప్రేమలో పడిన రేణు.. పెళ్ళికి ముందే అకీరాకు జన్మనిచ్చింది. అనంతరం పవన్ – రేణు పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్నాళ్ళకు ఆద్య జన్మించింది.  ఇక ఈ జంట కాపురంలో కలతలు రావడంతో రేణు.. పవన్ కు విడాకులు ఇచ్చి ఇద్దరు బిడ్డలతో సింగిల్ గా ఉండిపోయింది.

 

ఇక రేణు దేశాయ్.. గతంలో రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ, పవన్ అభిమానులు ఆమెపై ఫైర్ అయ్యి..  సోషల్ మీడియాలో వైరల్ చేసి రేణు పెళ్లిని ఆపేశారు. దీంతో అప్పటినుంచి ఆమె తన రెండో పెళ్లిపై ఫోకస్ పెట్టలేదు. ప్రస్తుతం సింగిల్ మదర్ గా ఇద్దరు పిల్లలను పెంచుతుంది రేణు. ఈ మధ్యకాలంలో ఆమె రీఎంట్రీ కూడా ఇచ్చింది.  సినిమాలతో పాటు యానిమల్స్ కోసం ఒక NGO  ను కూడా నడుపుతుంది.

 

చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇచ్చే రేణు దేశాయ్.. తాజాగా నిఖిల్ విజయేంద్ర సింహా నిర్వహిస్తున్న  నిఖిల్ తో నాటకాలు అనే పాడ్ క్యాస్ట్ లో పాల్గొంది.  ఇందులో ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది. కెరీర్, డ్రీమ్స్, రిగ్రెట్స్, పెళ్లి, పిల్లలు, రాజకీయాలు, హెల్త్.. ఇలా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది.

 

ఇందులో భాగంగా నిఖిల్.. ఎప్పుడైనా నాకంటూ ఒకరు ఉంటే బావుంటుంది అని మీకు అనిపించలేదా.. ? అని అడిగిన ప్రశ్నకు రేణు సమాధానమిస్తూ.. ” నాకు చాలాసార్లు అనిపించింది. చాలా ఇంటర్వూలలో కూడా చెప్పాను. కానీ, ఇక్కడ అందరూ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. పిల్లల బాధ్యత నా మీద ఉంది కాబట్టి.. నేను దాని గురించి ఆలోచించలేకపోతున్నాను. నాపరంగా.. నా హ్యాపీనెస్ నేను చూసుకుంటే.. అవును.. నాకు బాయ్ ప్రెండ్ కావాలి. పెళ్లి కావాలి.. లైఫ్ కావాలి.  వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పు. నేను ట్రై చేసినా.. కానీ అది కుదరలేదు.

 

నేనేం రియలైజ్ అయ్యాను అంటే రిలేషన్ కు, పిల్లలకు న్యాయం చేయలేనేమో అని. ఎందుకంటే.. నేను ఒక సింగిల్ మదర్ ను..  నా పిల్లలకు నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. వేరొకరిని పెళ్లి చేసుకుంటే.. అతనితో పిల్లలు ఉంటే.. ఆ సంసారం వేరే నడుస్తుంది.  కానీ, నువ్వు ఒకరిని పెళ్లి చేసుకొని, పిల్లలు ఉండి.. అతనితో విడిపోయి, వేరొక కొత్త పర్సన్ ను లైఫ్ లోకి ఆహ్వానించాలంటే అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.

 

నేను ఆద్య  పెరిగేవరకు వెయిట్ చేస్తున్నాను. తనకు ఇప్పుడు 15 ఏళ్లు. ఇంకో మూడేళ్లు ఆగితే తను కాలేజ్ కు వెళ్తుంది. 18 వస్తాయి. అప్పుడు నేను రిలాక్స్ అవుతాను. అప్పుడు వారే అర్ధం చేసుకుంటారు ” అని చెప్పుకొచ్చింది. అంటే ఇంకో మూడేళ్ళ తరువాత రేణు రెండో పెళ్ళికి రెడీ అవుతుందని తెలిసిపోయింది. అంతకుముందులా ఈసారి ఆమె భయపడడానికి కూడా లేదు. ఎన్నోసార్లు ఆమెనే తాను ఎవరికి భయపడను అని చెప్పుకొచ్చింది. మరి ఆద్య పెద్దది అయ్యాక.. రేణు రెండో పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

 

 

Exit mobile version
Skip to toolbar