Site icon Prime9

Ravanasura Teaser: రావణాసుర టీజర్ తో హైప్ పెంచిన మాస్ మహారాజా

Ravanasura Teaser

Ravanasura Teaser

Ravanasura Teaser: మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబో లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ మూవీలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవితేజ, అభిషేక్ నామాలు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది.

తాజాగా ఈ మూవీ టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే క్రూయల్ లుక్ లో ట్రెండీగా కనిపిస్తున్న పోస్టర్ ను ఇది వరకే చిత్ర యూనిట్.

 

సరికొత్తగా రవితేజ(Ravanasura Teaser)

తాజాగా రావణాసుర టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ లో రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్మార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ గుర్తొస్తాయి.

కానీ, రావణాసురతో విలన్ ని చూడండి అంటూ వచ్చేశాడు మాస్ మహారాజా. భారీ అంచనాలతో ఉన్న రావణాసుర.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో మరింత పెరిగాయి.

సుధీర్ వర్మ మేకింగ్ స్టయిల్, రవితేజ లుక్స్ తో టీజర్ అదిరిపోయింది. హర్హవర్ధన్ భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫి టీజర్ ను హైలెట్ గా నిలిపాయి.

ఇప్పటి వరకూ కామెడీ, సీరియస్ రోల్స్ లో రవితేజను చూసిన అభిమానులకు మాత్రం రావణాసుర లో రవితేజ మాత్రం సరికొత్తగా కనిపించనున్నాడు.

‘ సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని కూడా దాటాలి’ అంటూ మాస్ మహారాజా ఎంట్రీ ఇస్తాడు.

నిమిషమున్నర ఉన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రావణాసుర టీమ్ , ఏప్రిల్ 7 న ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

 

 

హైప్ పెంచిన టీజర్

భారీ బడ్జెట్ తో రావణాసుర ను నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడటం లేదని చిత్ర బృందం తెలిపింది.

హర్హవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని రెండు పాటలు మంచి రెస్పాన్స్ సాధించాయి. మిలియన్స్ వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచాయి.

ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా యూనిక్ స్టోరీ అందించారు.

సమ్మర్ లో వచ్చే సినిమాల్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ అయిన రావణాసుర ఏప్రిల్ 7 న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో శ్రీరామ్ , అను ఇమ్మాన్యుయేల్ , మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

 

Exit mobile version