Rashmika Mandanna Shared A Kindful Post: విజయ్ దేవరకొండపై విమర్శకలు వస్తున్న నేపథ్యంలో రష్మిక ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ప్రతి ఒక్కరు దయతో ఉండాలంటూ హితవు పలికింది. మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ప్రతి ఒక్కరు దయతో ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కైండ్ అని రాసి ఉన్న టి-షర్టు ధరించిన ఫోటో షేర్ చేసింది.
“ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను ఇతరుల పట్ల దయతోనే ఉండాలనుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లో అయిన దానినే ఎంచుకునేందుకు ప్రయత్నిస్తుంటా. మనమందరం ఒకరికొకరు దయగా ఉందాం” అంటూ రాసుకొచ్చింది. ఇది చూసి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతుందా అని ఆలోచనలోపడ్డారు. విజయ్‌పై వస్తున్న ట్రోల్స్ కారణంగానే రష్మిక ఈ పోస్ట్ చేసిందని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా బుధవారం విజయ్ దేవరకొండ, రష్మికలు జిమ్ నుంచి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇందులో విజయ్ ముందుగా నడుచుకుంటూ వస్తూ కారు ఎక్కాడు. ఆ తర్వాత రష్మిక కాలి గాయం కారణంగా అసౌకర్యంతోనే మెల్లి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కింది. ఆ సమయంలో జిమ్ సిబ్బంది రష్మికకు సాయం చేశారు. అయితే విజయ్ మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా ముంద వచ్చేసి కారు ఎక్కాడు. దీంతో నెటిజన్స్ అంతా విజయ్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. విజయ్‌కి అసలు దయ లేదని, రష్మిక అలా వదిలేసి వచ్చి కారు ఎక్కాడంటూ విమర్శించారు. రష్మికకు కాస్తా సాయం చెయొచ్చు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.