Site icon Prime9

Betting App Promotions: చిన్న చేపలే కాదు.. పెద్ద తిమింగలాలు ఉన్నాయి.. మరి వారినేం చేస్తారు..?

Betting App Promotions: బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. బెట్టింగ్ యాప్స్.. గత మూడురోజుల నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రజలకు హానీ కలిగించే ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసి సెలబ్రిటీలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఇలాంటివారిపై పోలీసులు కొరడా జూళిపించారు. ఇప్పటివరకు ప్రమోట్ చేసినవారిలో.. యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీతా, టేస్టీ తేజ, రీతూ చౌదరి, అభయ్, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సుధీర్ రాజు కిరణ్ గౌడ, యాంకర్ శ్యామల పేరు వినిపించాయి. ఇందులో 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

 

అయితే వీరందరూ చిన్న చిన్నవారు. వీరికన్నా స్టార్స్ గా గుర్తింపబడినవారు కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారిలో ఉన్నారు. వారి పేర్లు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆ స్టార్స్ లో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, అల్లు శిరీష్, పూజా హెగ్డే , బోమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్ ఇలా చాలామంది ఉన్నారు. ఇక  అందాల బొమ్మ నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది. ఉదయం నుంచి నిధిని ట్రోల్స్ చేస్తున్నారు.

 

ఇక వీరితో పాటు ఆ  లిస్ట్ లో రానా దగ్గువాటి, ప్రకాష్ రాజ్, కోలీవుడ్ హీరో శరత్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇప్పుడు కాదు కానీ, గతంలో వీరు డైరెక్ట్ గా రమ్మీ ఆడమని  యాడ్ కూడా చేశారు. ఇప్పుడు చిన్న చిన్నవారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు.. పెద్ద పెద్ద స్టార్స్ సంగతి ఏంటి అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

 

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ తెలిసి తెలియక ప్రమోట్ చేసినవారిపై కేసులు వేస్తే.. స్టార్స్ అయ్యి ఉండి కోట్లలో డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న స్టార్స్ పేర్లు ఎందుకు బయటకు తీయడం లేదు. ఎందుకు వారిపై కేసులు పెట్టడం లేదని ఫైర్ అవుతున్నారు. అయితే వీరందరికీ కూడా నోటీసులు జారీ అయ్యాయని, కొందరు తమ న్యాయవాదుల ద్వారా స్పందించారు, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

 

మరి చిన్న చిన్న చేపలను బయటకు లాగినప్పుడు  పెద్ద పెద్ద తిమింగలాలను కూడా బయటకు లాగాలి కదా.. అదెప్పుడు జరుగుతుంది అని అంటే.. అది అవ్వదమ్మా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి సజ్జనార్.. స్టార్ సెలబ్రిటీలను వదిలేస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Exit mobile version
Skip to toolbar