vyuham:సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు పార్టులుగా తీయబోతున్న వ్యూహం సినిమా స్టిల్స్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మొదటి పార్టుకి వ్యూహం, అని రెండో పార్ట్‌కి శపథం అని పేరు పెట్టారు. ఈ రెండు పార్టుల్లోనూ రాజకీయాలు పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే వర్మ ప్రకటించారు. ప్రస్తుతం వ్యూహం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 శపథంలో తగులుతుందని వర్మ 2022లోనే చెప్పారు.
రెండు పార్టులుగా సినిమా ..(vyuham)
అయితే ఈ రెండు సినిమాలు సిఎం జగన్ బయోపిక్ కాదని, రియల్ పిక్ అని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చెప్పేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పరిస్థితులు.. వాటి వెనుక వ్యూహాలు ఏం ఉన్నాయో ప్రారంభమై.. సమకాలీన రాజకీయాలు.. జరగబోయేవి కూడా స్టడీ చేసి రెండు పార్టులుగా సినిమా తీస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించాక వైఎస్ జగన్ ఎలా ఉన్నారు.. ఏం చేశారు.. ఇక్కడివరకు ఎలా వచ్చారు అనేది మాత్రమే చూపించబోతున్నారు. సినిమా ప్రకటించిన తర్వాత వర్మ చేసిన ట్వీట్ కూడా ఆసక్తిరేపింది. బిజెపి డివైడెడ్ బై పికె ఇంటూ సిబిన్ మైనస్ లోకేష్ ప్లస్ జగన్ ఈజ్ ఈక్వల్ టూ వ్యూహం అని రాంగోపాల్ వర్మ వివరించారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్, బీజేపీని ప్రస్తావించారు. దీంతో ఈ సినిమాపై హైప్ కూడా పెరిగింది.
బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని వర్మ పదే పదే చెబుతున్నారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుందని వర్మ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు.
షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ సినిమాలో వైఎస్ భారతి పాత్రని మానస రాధాకృష్ణన్ పోషిస్తున్నారు. ఇంతకు ముందు సినిమాలో మాదిరే వైఎస్ జగన్ పాత్రని అజ్మల్ అమీర్ మరోసారి మెరవనున్నారు. వైఎస్ భారతికి దాదాపు దగ్గరి పోలికలతో ఉన్న మానస రాధాకృష్ణన్ స్టిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.