Site icon Prime9

Ram Charan Vs Allu Arjun War: మెగా-అల్లు ఫ్యామిలీ వివాదం.. అల్లు అర్జున్‌ అన్‌ఫాలో చేసిన రామ్‌ చరణ్‌

Ram Charan Unfollows Allu Arjun in Instagram: మెగా – అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్‌ నుంచి అల్లు అర్జున్‌ బయటకు రావాలని చూస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అదేమి లేదన్నట్టుగా మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరి పండగలు, పుట్టిన రోజు వేడుకలు చేసుకునేవారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో ఈ వివాదం బయట పడింది. పవన్‌ కళ్యాణ్‌కు కాకుండ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్తి శిల్పా రవిందర్‌రెడ్డికి సపోర్టుగా నంద్యాల వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అప్పటి నుంచి మెగా-అల్లు ఫ్యామిలీలో వివాదం మరింత హాట్‌టాపిక్‌ అయ్యింది.

ఎప్పుడు ఏం జరుగుతుంది? ఎవరేలా స్పందిస్తారా? మీడియా, ఇండస్ట్రీ వర్గాలన్ని దీనిపై ఫోకస్‌ పెడుతున్నాయి. అయితే ఇంతవరకు ఎవరూ కూడా దీనిపై డైరెక్ట్‌ కామెంట్స్‌ చేయలేదు. ఇటీవల అల్లు అర్జున్‌ అరెస్ట్‌ కావడంతో చిరంజీవి ఆయన సతీమణి సురేఖ అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లారు. దీంతో ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయని అనిపించింది. కానీ ఇంకా వారి మధ్య మనస్పర్థలు కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. దీనికి కారణం రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో కావడమే కారణం. ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్‌ఫాలో అయ్యాడు చరణ్‌.

నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న చరణ్‌ ఉన్నట్టుండి బన్నీని అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల తర్వాత కూడా ఫాలో అవుతూనే వచ్చాడు. మరి సడెన్‌గా రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ అన్‌ఫాలో చేయడం ఏంటి? వీరి మధ్య ఏం జరిగిందని వీరి అభిమానులంత ఆలోచనలో పడ్డారు. అయితే బన్నీ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ని మాత్రం ఫాలో అవుతున్నాడు. నిజానికి రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ మధ్య మంచి బాండింగ్‌ ఉంది. ఇద్దరు ఒకరి సినిమా ఒకరు సపొర్టు ఇస్తూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. ఇంట్లో ఎలాంటి ఈవెంట్‌ అయిన బన్నీ, చరణ్‌లు చాలా క్లోజ్‌గా కనిపిస్తారు. మెగా-అల్లు ఫ్యామిలీలో ఎంతో ఉన్నారు. కానీ, వారిలో వీరిద్దరి బాండింగ్‌ మాత్రం స్పెషల్‌గా ఉంటుంది.

 

అలాంటిది వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఏం వచ్చాయని అనుకుంటున్నారు. రీసెంట్‌గా గేమ్‌ ఛేంజర్‌ ఫలితమై అల్లు అరవింద్‌ ఇన్‌డైరెక్ట్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఒక సినిమాని పడుకోబెట్టి,మరో సినిమా ఆకాశానికి ఎత్తి, ఆదాయ పన్ను శాఖను ఆహ్వానించి అంటూ నిర్మాత దిల్‌ రాజును ఉద్దేశిస్తూ అల్లు అరవింద్‌ కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్‌ మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ కామెంట్స్‌ నేపథ్యంలోనే చరణ్‌ బన్నీ అన్‌ఫాలో చేశాడా? అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మరి ఇది కావాలనే అన్‌ఫాలో చేశాడా? లేక పొరాపాటున ఇలా జరిగిందా? అనేది ఆలోచిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar